రెండుసార్లు రొమాన్స్ మిస్.. సూపర్‌స్టార్‌ను లెక్క చేయని ఇలియానా.. ఏం జరిగిందంటే..

అదృష్టం ఒక్కసారి లేదా రెండు సార్లు తలుపు తడుతుంది. కానీ దురదృష్టం మాత్రం తలుపు తడుతూనే ఉంటుందటా. ఆ విషయం టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఇలియానా డిసౌజా విషయంలో అక్షరాల నిజమైంది. బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ వస్

By Rajababu

అదృష్టం ఒక్కసారి లేదా రెండు సార్లు తలుపు తడుతుంది. కానీ దురదృష్టం మాత్రం తలుపు తడుతూనే ఉంటుందటా. ఆ విషయం టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఇలియానా డిసౌజా విషయంలో అక్షరాల నిజమైంది. బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు... అది ఏ ఖాన్ పక్క అయినా సరే అనుకునే భామలు టాలీవుడ్ లో కోకొల్లలు. అలాంటిది ఇలియానా కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించేందుకు అవకాశం రెండు సార్లు అదృష్టం అలా తన్నుకు వచ్చింది. నటించనని నో చెప్పింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీకి మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అందుకు కారణం ఏమిటీ, ఎందుకు అనేది శృతి (పోకిరిలో హీరోయిన్ పేరు) మాటల్లోనే....

పరిస్థితులు సహకరించలేదు

పరిస్థితులు సహకరించలేదు

సల్మాన్ పక్కన నటించాలని ఎవరికి ఉండదండి. ఆయన సరసన నటించాలని నాకు తెగ తాపత్రయం. అయితే నాటి పరిస్థితులే సహకరించలేదు. అంతేకాని మరేం లేదని కుండబద్దలు కొట్టింది ఇలియానా. అందుకు కారణం ఏమీ లేదు... టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం బాక్సాఫీసు రికార్డులను తుడిపెట్టేన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని తెలిపింది.

Recommended Video

Actor Ileana D’Cruz Says About Her Dating
బోనీ కపూర్ ఆఫర్

బోనీ కపూర్ ఆఫర్

ఆ సినిమాను 2009లో హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేశారు. ఆ చిత్రంలో హీరోయిన్ గా నిర్మాతలు నన్ను ఎంపిక చేశారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత బోని కపూర్ నుంచి తనకు పిలుపు వచ్చింది. ఫోటో షూట్ కు రావాల్సిందిగా ఆయన కోరారు. నాకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేను రాలేను అని కపూర్ కోరికను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు.

అయేషా టకియాకు దక్కిన

అయేషా టకియాకు దక్కిన

అలా ఫస్ట్ ఛాన్స్ పోయింది. అయితే ఈ చిత్రంలో అయేషా టకియా హీరోయిన్ గా సదరు నిర్మాతలు ఎంపిక చేశారు. ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమా ఛాన్స్ లను టకియా కల్లో కూడా ఊహించి ఉండదూ. సినిమా రంగంలో ఆమె ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుందని చెప్పింది. ఆ అవకాశం వదులుకొన్న తర్వాత బాలీవుడ్ లో సినిమా చేయడానిక మూడేళ్లు పట్టిందంటూ తన గత జ్జాపకాలను నెమరేసుకుంది.

బర్ఫీతో బాలీవుడ్ ఎంట్రీ..

బర్ఫీతో బాలీవుడ్ ఎంట్రీ..

ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ లభించింది. అయితే బర్ఫీ సినిమాను అంగీకరించేందుకు మూడు నెలలు సమయం తీసుకొన్నాను. ఆ పాత్రను నేను చేయగలుగుతానా అనే సందేహం నాకు ఉండేది. ఆ కారణంగా ఆ సినిమాను కూడా వదులుకుందామనుకొన్నాను. కానీ ధైర్యం చేసి చివరకు ఒప్పుకొన్నాను. రణ్‌బీర్ కపూర్ సరసన బర్ఫీ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడం సంతోషం కలిగించింది.

భజరంగీ కూడా మిస్

భజరంగీ కూడా మిస్

ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ భజరంగీ భాయ్ జాన్. అందులో సల్మాన్ పక్కన నటించే ఛాన్స్ ను కూడా వదులుకున్నాను. ఆ తర్వాత ఆ అవకాశం కరీనా కపూర్ దక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే భజరంగీ భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X