అనుష్క ఔట్: క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఇకపై ఇలియానా
హైదరాబాద్: క్రికెట్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ హద్య ఎఫైర్ నడుస్తున్నట్ల గత కొంతకాలంగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం లాంటి సంఘటనలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ మధ్య పరిచయం ఏర్పడటానికి కారణం.....ఇద్దరూ కలిసి ఓ షాంపూ యాడ్లో కలిసి నటించడమే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షాంపూ యాడ్లో ఇకపై అనుష్క శర్మ కనిపించబోదని తెలుస్తోంది. ఆమె స్థానంలో హీరోయిన్ ఇలియానాను తీసుకున్నట్లు సమాచారం.

పలు సినిమాలకు కమిట్మెంట్స్ ఇచ్చి షూటింగుల్లో బిజీగా గడుపుతున్నందు వల్ల ఇకపై తాను యాడ్ ఫిల్మ్స్ షూటింగులకు హాజరు కాలేనని అనుష్క శర్మ చెప్పడంతో....కంపెనీ ప్రతినిధులు ఇలియానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీతో కలిసి యాడ్ ఫిల్మ్ నటించే అవకాశం కావడంతో గోవా బ్యూటీ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో హాట్ హీరోయిన్ అయిపోయింది. దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా.... బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా హిట్ కావడంతో పాటు ఇటీవల విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం కూడా విజయం సాధించింది. అమ్మడుకి దక్షిణాదిన కూడా మంచి పాపులారిటీ ఉండటంతో తమకు కలిసొస్తుందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications











