»   » బికినీ కే చచ్చిపోతూంటే లిప్ కిస్ తో ఇంకో వీడియో... ఇలియానా చంపేస్తోంది (వీడియో)

బికినీ కే చచ్చిపోతూంటే లిప్ కిస్ తో ఇంకో వీడియో... ఇలియానా చంపేస్తోంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు తెర మీద ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్‌ మీద మోజుతో దూరమైంది గోవా బ్యూటీ ఇలియానా. అయితే అక్కడ అనుకున్నంతగా సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ అమెను పట్టించుకోవడం మానేసింది. అందుకే ఇటీవల ఉన్నట్టుండి ఇలియానా రూట్‌ మార్చింది. రోజురోజుకూ బోల్డ్‌గా మారిపోతోంది. ఇటీవల స్విమ్మింగ్‌పూల్‌ అడుగున బికినీతో ఆమె చేసిన విన్యాసం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ఆ వీడియోను అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్‌ సాధించి.. ఈ వారం టాప్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఒకటిగా కూడా నిలిచింది. ఇలియానా ఇంతలా రెచ్చిపోవడానికి ఓ కారణముందంటున్నారు బాలీవుడ్‌ జనాలు.

  ఇలియానా అస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 2014 నుంచి సహజీవనం చేస్తున్నట్లు, గత డిసెంబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ గాసిప్పులుగానే మిగిలిపోయాయి అనుకుంటున్న సమయంలో ఇలియానా పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే ఆ వార్తలు నిజమేననే అనుమానం కలగకమానదు. ఆ అనుఇమాలను నిజం చేస్తూ ఇప్పడు తన హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి సెగలు పుట్టిస్తుంది. మొన్నామధ్య స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని ఉన్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇల్లీ బేబి, తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది.

  బాలీవుడ్ చేరుకుంది:

  బాలీవుడ్ చేరుకుంది:

  సౌత్ మొత్తాన్ని సన్నని నడుముతో ఉర్రూతలూగించిన ఇలియానా అప్పటివరకూ అసలు సౌత్ లో ఏ హీరోయిన్ కీ లేని ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో ఒక స్టార్‌గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వతా బాలీవు‌డ్‌కు తన మకాం మార్చేసింది. తెలుగులో అప్పటికే కొత్త హీరోయిన్లు రావటం, రెమ్యున రేషన్ పెంచే అవకాశం లేకపోవటం వల్ల కూడా ఇల్లూ... బాలీవుడ్ చేరుకుంది.

  అవకాశాలు రాక:

  అవకాశాలు రాక:

  బర్ఫీ లో నటనకి అందరూ మంచి కితాబిచ్చారు కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. చాలా కాలం పాటు అక్కడ అవకాశాలు రాక, వచ్చినా సరైన హిట్ లేక చాలానే స్ట్రగుల్ అయ్యింది. అతికష్టం మీద అక్షయ్ కుమార్‌తో రుస్తుంలో నటించింది. ఈసారి మాత్రం ఇలియానా నటనతో పాటు సినిమాకూడా మంచి హిట్ నే అందుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు మాత్రం రాలేదు...

  కెరీర్ కు ఎర్త్ పెట్టేసుకుంది:

  కెరీర్ కు ఎర్త్ పెట్టేసుకుంది:

  ఇలియానాకు ఇప్పుడు తెలుగులో అవకాశాలేం లేవు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరస ప్రాజెక్ట్స్ తో కుమ్మేసిన ఈ భామ, ఇప్పుడు అవకాశాల్లేక గోవాలో గోళ్లు గిల్లుకుంటోంది. బాలీవుడ్ లో రెండు అవకాశాలు రాగానే, టాలీవుడ్ గురించి పిచ్చి కూతలు కూసి స్వయంగా కెరీర్ కు ఎర్త్ పెట్టేసుకుంది. ప్రస్తుతం ట్విట్టర్లో డబుల్ మీనింగ్ ట్వీట్లతో, ఎలాగోలా న్యూస్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది.

  ఇక్కడే ఉంటా:

  ఇక్కడే ఉంటా:

  బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో యాక్ట్ చేసిన రుస్తుం ఒక్కటే ఈ భామకు ఇప్పట్లో ఉన్న రిలీజ్. చేతిలో కూడా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. రుస్తుం ప్రమోషన్లో ఉన్నప్పుడు, మీ కెరీర్ ప్లాన్ ఏంటి అని విలేకరి అడిగిన క్వశ్చన్ కు, నా కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. రుస్తుం తర్వాత కూడా ఇక్కడే ఉంటా అంటూ సెలవిచ్చింది. అసలు ఇప్పుడు ఇలియానా పరిస్థితేమిటంటే....

  మంచి ఆరంభం:

  మంచి ఆరంభం:

  టాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఎదిగిన కొద్ది కాలానికే బాలీవుడ్‌లో కెరీర్‌ను వెతుక్కుంటూ వెళ్లిన ఈ గోవా బ్యూటీకి 'బర్ఫీ' రూపంలో మంచి ఆరంభం దక్కింది కానీ, ఆ తర్వాత ఆశించిన రీతిలో విజయాలు లభించలేదు. 'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' యావరేజ్‌గా ఆడగా, 'కందిరీగ' రీమేక్‌ 'మై తేరా హీరో' సైతం అదే స్థాయిలో ఆడింది.

  వృధా అవ్వలేదు:

  వృధా అవ్వలేదు:

  "రుస్తుం"తో తన కెరీర్‌ మలుపు తిరిగిపోతుందనీ చాలానే ఆశలు పెట్టుకుంది.పనిలోపనిగా అందరి దృష్డిని ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఇలియానా సినిమా ప్రచారంతో పాటు తన వ్యక్తిగత ప్రచారం కూడా బాగానే చేసుకున్నా ఇంకా బాలివుడ్ లో అవకాశాలేం రానేలేదు.సినిమా మొదలైన దగ్గర్నుంచీ అక్షయ్ ని విపరీతంగా పొగిడిన పొగడ్తలు మాత్రం వృధా అవ్వలేదు.. ‘రుస్తుం' తర్వాత అజయ్‌దేవ్‌గన్‌ ‘బాద్‌షాహో' చిత్రంలో ఆమె నటిస్తోంది అనే వార్తలు వినిపించినా ఇంకా దానిలో ఏ క్లారిటీ కనిపించటం లేదు.

  రూట్‌ మార్చింది:

  రూట్‌ మార్చింది:

  అందుకే ఇటీవల ఉన్నట్టుండి ఇలియానా రూట్‌ మార్చింది. రోజురోజుకూ బోల్డ్‌గా మారిపోతోంది. ఇటీవల స్విమ్మింగ్‌పూల్‌ అడుగున బికినీతో ఆమె చేసిన విన్యాసం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ఆ వీడియోను అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్‌ సాధించి.. ఈ వారం టాప్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఒకటిగా కూడా నిలిచింది. ఇలియానా ఇంతలా రెచ్చిపోవడానికి ఓ కారణముందంటున్నారు బాలీవుడ్‌ జనాలు.

  ఆండ్రూ నీబోన్‌:

  ఆండ్రూ నీబోన్‌:

  ప్రస్తుతం ఈమె ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ సహాయంతోనే హాట్‌ హాట్‌ ఫోటోలను వదులుతోంది ఇలియానా. ఇలా చేయడం వల్ల రెండు లాభాలున్నాయి. ఇలియానా గ్లామర్‌ బాలీవుడ్‌ జనాలకు, అభిమానులకు మరింత చేరువ కావడం. పనిలోపనిగా బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ ఫోటోగ్రఫీ టాలెంట్‌ను ఇండసీ్ట్ర జనాలకు పరిచయం చేయడం. ఇలా హాట్‌ ఫోటోలతో బాయ్‌ఫ్రెండ్‌కు, తనకు ఫ్రీ పబ్లిసిటీ ప్లాన్‌ చేస్తోందన్న మాట ఇలియానా.

  బాయ్‌ఫ్రెండ్‌:

  బాయ్‌ఫ్రెండ్‌:

  ఆ అందాన్ని కెమెరాలో బంధిస్తూ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రచ్చ చేస్తోంటే, ఆ ఫోటోలన్నీ ఇలియానా ఇంటర్నెట్‌లో పెడుతూ ఫాన్స్‌కి కనువిందు చేస్తోంది. కనీసం ఇది చూసి అయినా ఇలియానాకి తగిన పాత్రలిచ్చి బాలీవుడ్‌ ఆమె అందానికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి. ఎంత కాదన్నా బాలీవుడ్‌ వాళ్లకి సౌత్‌ నుంచి వచ్చిన హీరోయిన్లంటే చిన్నచూపే. అందుకే కాజల్‌, శ్రియలాంటి సెక్సీ హీరోయిన్లు సైతం అక్కడ స్ట్రగుల్‌ అవ్వాల్సి వచ్చింది.

  మేకప్ వున్నా లేకపోయినా:

  మేకప్ వున్నా లేకపోయినా:

  అందం విషయంలో ఆండ్రూకు ఎలాంటి పట్టింపులు లేవని, తాను ఎలా ఉన్నా ఆరాధిస్తాడని, నాపట్ల ఆండ్రూ చూపించే ప్రేమ కొంచెం కూడా తగ్గదని అంటోంది ఇలియానా. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ నాకు మేకప్ వున్నా లేకపోయినా తను ఇష్టపడతాడు. నేను ఎలా వున్నా నా మొహాన్ని చూడటం అతడికి చాలా ఇష్టం. నాలోని గ్లామర్‌నే కాదు...

  ఆండ్రూ ఇష్టపడతాడు:

  ఆండ్రూ ఇష్టపడతాడు:

  డీగ్లామర్‌ను కూడా ఆండ్రూ ఇష్టపడతాడు. జుత్తు రేగిపోయినా కూడా అందంగానే ఉన్నానని ప్రశంసలు కురిపిస్తాడు. నేను ఎలాంటి డ్రెస్‌వేసినా బాగుందని కితాబిస్తాడు అంటూ గోవా సుందరి ఇలియానా ప్రియుడి గొప్పతనాన్ని అభివర్ణించింది. అండ్రూతో పెళ్లి గురించి ప్రశ్నిస్తే మాత్రం నేను ప్రణాళిక ప్రకారం పనులు చేయను. ఒకరిని ఇష్టపడితే...వెంటనే పెళ్లాడాలనే రూలేం లేదు. దేనికైనా టైమ్ రావాలి అంటూ సమాధానం దాటవేసింది. ఇలియానా ధోరణి చూస్తుంటే ఆండ్రూతో ఆమె సహజీవనం చేస్తున్నది నిజమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

  బికినీ వీడియో:

  బికినీ వీడియో:

  అయితే అవి కూడా బోర్ కొట్టాసాయో ఏమో గానీ, ఈ సారి ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో ఆండ్రూ ఆధ్వర్యంలో ఒక బికినీ వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన పుట్టినరోజును ఎంత బాగా ఎంజాయ్ చేసానో అన్న దానికి నిదర్శనమే అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఇలియానా అందాల ఆరబోత వీక్షకులను కట్టిపడేస్తోంది.

  రెండో వీడియో కూడా:

  ఇప్పుడు ఆ వీడియోతోనే మరికొన్ని ఫొటోలను మిక్స్ చేసి రెండో వీడియో కూడా వదిలింది. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బికినీలు ధరించడం ఇలియానాకు కొత్తమీద కాదు. ‘దేవదాసు, ఆట, సలీం' వంటి సినిమాలలో తన బికినీ సౌందర్యాలను బహిరంగపరిచి తెలుగు ప్రేక్షకులకు కన్నుల విందు చేసింది. అలాగే బాలీవుడ్ కు వెళ్ళిన సమయంలోనూ హాట్ హాట్ బికినీ ఫోటోషూట్లు ఇచ్చింది. అయితే ఇంతలా ఎపుడూ తన అందాలనుబహిరంగపరచలేదు.ఒక్క సారి ఆవీడియో మీద ఒక లుక్ వేయండి.

  English summary
  Actress Ileana D’Cruz and her Australian boyfriend Andrew Kneebone are giving us some major couple goals. The duo have been time and again spotted sharing some adorable pictures of their time spent together. They have now come up with an adorable video.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more