ఇలియానా పెళ్లి అయిపోయిందట.. ఎవరితో .. ఎక్కడంటే..?
అందం, అభినయంతో దక్షిణాదితోపాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార ఇలియానా పెళ్లైయిపోయింది. ఈ విషయాన్ని ఆమెనే తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌లో చూచాయగా వెల్లడించింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడో అయిపోయిందనే వార్తలకు ఈ పోస్ట్ బలాన్ని ఇచ్చింది. అయితే ఇలియానా సీక్రెట్ మ్యారేజ్ ఇప్పుడైంది? ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

బాయ్‌ఫ్రెండ్‌తో అఫైర్
గత కొద్దికాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో అఫైర్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి పెళ్లి జరిగింది అని అడపాదడపా వార్తలు వస్తున్నా అందుకు ఆధారాలు దొరకలేదు. కానీ స్వయంగా నా భర్త తీసిన ఫొటో అంటూ ఇన్స్‌ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టడంతో ఇక ఆమె కుమారి కాదు.. శ్రీమతి అని తేలిపోయింది.

నా భర్త తీసిన ఫోటో
తన ఇన్స్‌టాగ్రామ్‌లో క్రిస్మస్ ట్రీని అలకరిస్తు ఉన్న ఫొటోను ఇలియానా పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు ‘2017 నాకు చాలా ఇష్టమైన సంవత్సరం', క్రిస్మస్ టైమ్, హ్యాపీ హాలీడేస్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టింది. ఇది నా భర్త తీసిన ఫొటో అంటూ ఓ కామెంట్‌ను కూడా పోస్ట్ చేయడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.

సహజీవనం చేస్తున్నా
గతంలో పలుమార్లు మీడియాతో ఇలియానా మాట్లాడుతూ.. నేను సహజీవనం చేస్తున్నాను. ఏ సమయంలోనైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి, సహజీవనం రెండు వేర్వేరు. ఎప్పుడైనా ఓ చిన్న పేపర్ వాటిని విడదీస్తుంది.

పెళ్లి కీలకమైంది
మన సమాజంలో ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లంటే చాలా కీలకమైనది. ఇద్దరి జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుంది. కానీ నేను ఆ కోణంలో చూడను. పెళ్లి నా భర్త జీవితంలో గానీ, నా జీవితంలో పెద్దగా మార్పు తీసుకురాదు అని ఇలియానా అభిప్రాయపడింది.

మీడియా కంట ఇలియానా
2014 నుంచి అండ్రూస్‌తో ఇలియానా అఫైర్ కొనసాగిస్తున్నది. అప్పటి నుంచి మీడియా కంట వారిద్దరూ చిక్కుతూనే ఉన్నారు. ఇలియానా తన ప్రియుడితో కలిసి పార్టీలకు, సినిమా ఫంక్షన్లకు దర్శనమిచ్చింది. అయితే ఇటీవలనే వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారనే వార్త వినిపిస్తున్నది. అయితే పెళ్లి గురించి ఇలియానా నోరు విప్పితేనే ఆ గుట్టు విప్పుకొంటుంది.

అగ్రతారగా ఇలియానా డిక్రజ్
తెలుగులో అగ్రహీరోల అందరి సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఇలియానా మంచి పేరు తెచ్చుకొన్నది. బర్ఫీ చిత్రంతో బాలీవుడ్‌లో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అంతగా పాపులారిటీ రాలేదు. తాజాగా బాద్షాలో నటించింది. ముబాకరన్ చిత్రం త్వరలో విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











