ఇలియానా సంచలన వ్యాఖ్యలు.. సౌత్ వాళ్ళ దృష్టి నడుముపైనే.. దేవదాసులో అలా!
Recommended Video

నడుము సుందరి ఇలియానా సంచలన వ్యాఖ్యలతో మరో మారు వార్తల్లో నిలిచింది. ఈ సారి ఇలియానా దక్షణాది చిత్ర సీమని టార్గెట్ చేసింది. సౌత్ లో సినిమాలు కేవలం హీరోయిన్ శరీరంపైనే ఆధార పడి ఉంటాయని అది ఎందుకో అర్థం కాదని ఇలియానా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవదాసు సినిమా గురించి కూడా ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం టాలీవడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ లో అవకాశాలు తగ్గక ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ అమ్మడి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇలియానాకు అవకాశాలు బాగా సన్నగిల్లిపోయాయి.

దేవదాసుతోనే అందాల ఆరబోత
ఇలియానా దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే అండ్ల ఆరబోతలో రెచ్చిపోయింది. ఆ చిత్రంలో ఇలియానా తడి అందాలకు కుర్ర కారు ఫిదా అయిపోయారు.

పోకిరితో సంచలనం
పోకిరి చిత్రంలో ఇలియానా చేసిన మాయ అంతా ఇంతా కాదు. అప్పట్లో చాలా రోజులు యువత ఇలియానా జపం చేసారు. ఇలియానాకు ఆ తరువాత ఊపిరితిరగకుండా అవకాశాలు క్యూ కట్టాయి. ఇలియానా నడుముతో చేసిన మాయ అది. ఇప్పటికి నడుము సుందరి అంటే యువతకు ఇలియానానే గుర్తుకు వస్తుంది.

చాలా కాలం సాగిన ఇలియానా హవా
పోకిరి చిత్రం తరువాత ఇలియానా చాలా కాలం పాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా రాజ్యం ఏలింది. సౌత్ లో భారీ పారితోషంకం తీసుకుంటున్న భామగా అవతరించింది.

బాలీవుడ్ బాట
అవకాశాలు తగ్గిన తరువాత ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఇలియానా ప్రభావం పెద్దగా కనిపించలేదు.

సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో గ్లామర్ హొయలు
అవకాశాలు బాగా తగ్గడంతో ఇలియానా సోషల్ మీడియాలో అందాల హొయలు తెరలేపింది. బికినీ ఫోటో షూట్ లతో రచ్చ చేసింది. అయినా కూడా ఇలియానాకు అవకాశాలు దక్కలేదు.

సౌత్ పై సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఇలియానా సౌత్ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో కేవలం హీరోయిన్ల శరీరం పై ఆధారపడి మాత్రమే సినిమాలు చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది.

ఆ దర్శకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు
దేవదాసు చిత్రంలో నటిస్తున్న సమయంలో దర్శకుడు తనపై కామెంట్లు చేసాడని ఇలియానా ఆరోపించింది. తన నడుముపై ఏదో పడింది.. అది చాలా అందంగా ఉంది అని దర్శకుడు కామెంట్ చేసిన ఇలియానా తెలిపింది. సౌత్ లో చాలా మంది నా నడుముపైనే దృష్టి పెట్టేవారు. నా నడుము అందంగా ఉంది అని కామెంట్లు చేసేవారు. పదేపదే ఇలా ఎందుకు కామెంట్ చేస్తున్నారో తనకు అర్థమయ్యేది కాదని ఇలియానా ఆరోపించింది.

తాప్సి, హీనా ఖాన్ కూడా ఇదే తరహాలో
తాప్సి, హీనా ఖాన్ కూడా ఇదే తరహాలో సౌత్ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజగా ఇలియానా వ్యాఖ్యలు వివాదంగా మారాయి.


Click it and Unblock the Notifications











