ఇలియానా తెలుగులో 80, తమిళంలో 40!

ఇలియానా వరుస అదేలా ఉంది. తెలుగులో 80 లక్షలు డిమాండ్ చేస్తున్న ఈ భామ తమిళంలో 40 లక్షలతో సరిపుచ్చుకుంటోంది. ఈ తేడా ఏమిటని అడిగితే తడబడకుండా చక్కటి అబద్దాలు చెబుతోంది. తెలుగులో తాను హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఒప్పుకుంటున్నానని, కష్టం ఎక్కువ కాబట్టి ఎక్కువ పారితోషికం అడుగుతున్నానని చెప్పింది. తమిళంలో కేవలం ఆటబొమ్మ లాంటి హీరోయిన్ పాత్రలు కాబట్టి తక్కువ పారితోషికంతో సరిపెట్టుకుంటున్నానని ఇలియానా అంటోంది.
ఇలియానా ప్రస్తుతం తెలుగులో తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ప్రభుదేవా దర్శకత్వంలో విజయ్ సరసన నటించనుంది.


Click it and Unblock the Notifications











