అక్కినేని వారి సినిమాకు...2 కోట్లు అడిగిన ఇలియానా
హైదరాబాద్ : వరుస ప్లాపులకు తోడు, బాగా బక్క చిక్కిన హీరోయిన్ ఇలియానాకు తెలుగుతో పాటు దక్షిణాదిన అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే రెమ్యూనరేషన్లో మాత్రం అమ్మడు ఇంచు కూడా దగ్గక పోగా గతంలో కంటే మరింత ఎక్కువ డిమాండ్ చేసి మరీ నిర్మాతల నుంచి పిండుకుంటోంది. దీనికి కారణం బాలీవుడ్లో ఆమె నటించిన 'బర్ఫీ' చిత్రం విజయం సాధించడమే.
బర్ఫీ చిత్రం రూ. 100 కోట్ల వసూళ్లు క్రాస్ చేయడంతో తన రేంజి పెరిగిందని ప్రచారం చేసుకుంటోందట. తాజాగా అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్యలతో కలిసి తెలుగులో 'మనం' అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించాలని ఇలియానాను సంప్రదించగా ఏకంగా రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
పోకిరి విజయం తర్వాత సౌత్ లో ఇలియానా రేంజి పెరిగి పోయింది. త్రిష, నయన తార, అనుష్క మాదిరి సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో చేరింది. భలే దొంగలు చిత్రానికి తొలిసారిగా సౌత్ లో రూ. 1 కోటి రెమ్యూరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డులకెక్కింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'నంబన్'(తెలుగులో స్నేహితుడు) చిత్రానికి రూ. 1.5 కోట్లు తీసుకుని మరోసారి అత్యధిక మొత్తం తీసుకున్న హీరోయిన్ గా మారింది.
తాజాగా అక్కినేని ఫ్యామిలీ మూవీలో రూ.2 కోట్లు అడిగి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆమెకు స్క్రిప్టు నచ్చిందని, చేయడానికి ఒకే చెప్పిందని, అయితే రెమ్యూనరేషన్ రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ డీల్ ఒకే అయతే సౌత్ లో రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఇలియానా చరిత్ర సృష్టించనుంది. అయితే ఇలియానా సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని, ఆమె రూ. 2కోట్లు డిమాండ్ అనేది నిరాధారమైన వార్తే అని అంటోంది.


Click it and Unblock the Notifications











