జూ ఎన్టీఆర్ నుండి ఎక్కువగా ఆశిస్తున్న ఇలియానా..!?
ఒకప్పుడు టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా వున్న గోవా మెరుపు తీగ ఇలియానా ప్రస్తుతం తెలుగులో చేస్తున్నవి రెండే రెండు సినిమాలు. ఇందులో ఒకటి 'శక్తి' కాగా, మరొకటి 'నేను-నా రాక్షసి'. రెండూ పూర్తయి రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. 'శక్తి' ఈ నెల 30 న, 'నేను నా రాక్షసి ' వచ్చే నెల మొదటి వారంలోనూ రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలూ తనకి మంచి పేరు తెచ్చి తెలుగులో తనని మళ్లీ బిజీ చేస్తాయని ఆమె ఆశిస్తున్నప్పటికీ, 'శక్తి' మీద కాస్త ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే, ఇందులో ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తుందట. కాస్టుమ్స్ పరంగా ఈ సినిమా ఇలియానాని ఇంతవరకు ఎందులోనూ కనపడని విధంగా చూపిస్తుందట.
'ఇలియానాని శ్రీదేవిలా చూపించాల'ని దర్శకుడికి నిర్మాత దత్తు ముందే చెప్పారంటే, ఆ పాత్ర ఎంతటి గ్లామరస్ పాత్రో మనం ఊహించుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, 'జగదేక వీరుడు -అతిలోక సుందరి' సినిమాలో శ్రీదేవి పాత్రలాంటిదన్న మాట. అందుకే, ఇలియానా కూడా ఇప్పుడు తన సన్నిహితులతో ఈ సినిమా గురించే గొప్పగా చెబుతోందట. టాలీవుడ్ లో ఇది తనకు పూర్వ వైభవాన్ని తెస్తుందని ఇలియానా హోప్ పెట్టుకుంది. మరి ఈ 'శక్తి' ఆమెకు అంతటి శక్తి ఇస్తుందా? లేదా? అన్నది సినిమా రిలీజ్ అయితేనే కానీ చెప్పలేం!


Click it and Unblock the Notifications











