ఆ సినిమా వందసార్లుకు పైగానే చూసా: ఇలియానా
దాదాపు ఇప్పటికి వందసార్లుపైనే చూసుంటా.ఎప్పుడన్నా బోరుకొట్టినప్పుడు ఆ సినిమానే చూస్తాను. ఎన్నిసార్లు చూసినా ఆ చిత్రంలోని పాత్రల్లో నేను లీనమైపోతాను.అక్కడ నేను నటిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది ఇలియానా.ఇంతకీ ఇలియాకు నచ్చిన ఆ చిత్రం టైటిల్ 'ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్".ప్రస్తుతం శక్తి చిత్రం ఫ్లాప్ లో ఉన్న ఆమె ఇలా మీడియా వద్ద కబుర్లు చెప్తోంది.అలాగే ఆమె నటించిన నేను ...నా రాక్షసి చిత్రం మార్కెట్ కావటం లేదని,అందుకే విడుదల కావటం లేదని టాక్.
తన గురువు పూరీ దర్శకత్వంలో చేసినా ఇలాంటి సమస్య ఎదురుకావటం ఆమెను ఇబ్బందుల్లో పడేస్తోంది.అయితే ప్రస్తుతం తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఆమే కావటం విశేషం.ఇక ఆమెకు నచ్చిన ఫాధర్ ఆఫ్ ది బ్రైడ్ చిత్రం విషయానికి వస్తే ఆ చిత్రం ఇప్పటికే తెలుగులో మూడుసార్లు వచ్చింది.ఒకసారి చిరుజల్లుగామరోసారి నువ్వు..నువ్వే గా,ఆ మధ్య ఆకాశమంతగా ఫ్రీ మేక్ చేయబడింది.ఇలియానా డేట్స్ ఇస్తానంటే మరోసారి ధైర్యం చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











