»   » డమ్మీ ఇలియానాకు అంత సీన్ లేదంట....!

డమ్మీ ఇలియానాకు అంత సీన్ లేదంట....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోవా బ్యూటీ ఇలియానాకు సినిమాలు లేకపోయినా గొప్పలు మాత్రం బాగానే చెబుతోంది. పైగా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాతో తనని తాను సమానంగా పోల్చుకుంటోంది. సౌత్ లో ఇంచుమించు తన దుకాణం ఖాళీ చేసేసిన ఇలియానా ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో 'బర్ఫీ" అనే హిందీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

ఈ సినిమాలో ప్రియాంకా మానసిక వికలాంగురాలి పాత్రను పోషిస్తూ, మిగతా వాళ్లను డామినేట్ చేసే విధంగా ఉన్నత స్థాయిలో నటిస్తోందని అంటున్నారు. షూటింగులో ఆమె నటనను చూసిన వాళ్ళంతా ఆమెకు అవార్డ్ గ్యారంటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇది చూసి, ఇలియానా అప్ సెట్ అవుతోందట. క్రెడిట్ అంతా ఆమెకే వెళ్ళిపోయేలా వుందని భావించి, ఇప్పుడు గొడవపెడుతోందని అంటున్నారు. తన పాత్రకు ఇంపార్టెన్స్ పెంచమని దర్శకుడిని డిమాండ్ చేస్తోందట. దర్శకుడు మాత్రం పెంచేది లేదని తెగేసి చెప్పేస్తున్నాడు.

దానికి తగ్గట్టుగా ఇందులో ఇలియానాది డమ్మీ పాత్రేనని వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలను ఇలియానా ఖండిస్తోంది. 'కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంది. అసలు ఎవరిది లీడ్ రోల్ అనేది కూడా చెప్పలేం. ఇద్దరి పాత్రలూ సమాన ప్రాధాన్యతతో వుంటాయి' అంటూ కొట్టిపారేస్తోంది. ఇది విన్నా వాళ్లు మాత్రం 'నీకంత సీను లేదు తల్లీ" అంటూ నవ్వుకుంటున్నారు.

English summary
There have been rumors doing the rounds that Ileana and Priyanks are not getting along. Apparently, Ileana wants to make sure she gets noticed so she has been asking the director to make her role meatier. Priyanka was supposedly not happy with all the interfering.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu