బాబోయ్, ఇది మామూలు షాక్ కాదు.. రాంచరణ్ సినిమా కోసం ఇలియానా.. 'అఅఅ' తరువాత కూడా!
Recommended Video

నడుము సుందరిగా పేరుగాంచిన గోవా ముద్దుగుమ్మ ఇలియానా చాలా కాలం తరువాత అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రవితేజ సరసన నటించిన ఈ చిత్రంపై ఇలియానా పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. జులాయి, దేవుడు చేసిన మనుషులు చిత్రాల తరువాత టాలీవుడ్ కు దూరమైన ఇలియానా బాలీవుడ్‌లో పాగావేయాలని ప్రయత్నించింది. ఆరంభంలో ఆదిశగా అడుగులు వేసినా ఆ తరువాత పరిస్థితి తారుమారైంది. ఇలియానాకు అవకాశాలు కరువయ్యాయి. కానీ ఇలియానాకు ఇప్పటికీ టాలీవుడ్‌లో క్రేజ్ తగ్గలేదని చెప్పొచ్చు.

అమర్ అక్బర్ ఆంటోని
అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఇలియానాకు దాదాపు ఆరేళ్ళ తరువాత టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. పైగా రవితేజ, శ్రీనువైట్ల క్రేజీ కాంబినేషన్ కావడంతో ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇలియానా రీఎంట్రీ చిత్రం కావడంతో, శ్రీనువైట్ల హిట్ కొట్టాలనే పట్టుదలతో సినిమా చేయడంతో అభిమానులు అమర్ అక్బర్ ఆంటోని చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అటు అభిమానుల అంచనాలు, ఇలియానా అసలు తలక్రిందులయ్యాయి.

టాలీవుడ్ కోసం రెడీ
ఇకపై టాలీవుడ్‌లో ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోకూడదనే ఆలోచనలో ఇలియానా ఉంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం విజయం సాధించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఆ చిత్రం నిరాశపరచడంతో మరో అవకాశం కోసం ఇలియానాకు ఎదురుచూపులు తప్పవు. తాజాగా ఇలియానా గురించి వస్తున్న ఒక వార్త టాలీవుడ్ వర్గాలని షాక్‌కి గురిచేస్తోంది.

రాంచరణ్ సినిమాకు షాక్
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ బోయపాటి దర్శత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం ఇలియానాని సంప్రదించారట. కానీ ఇలియానా దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అంటూనే 60 లక్షలు డిమాండ్ చేసినట్లు టాక్. దీనితో చిత్ర యూనిట్ షాక్‌కి గురైనట్లు తెలుస్తోంది.

ఏం చేస్తారో మరి
ఇలియానా డిమాండ్ చేసిన మొత్తానికి చిత్ర యూనిట్ అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలియానాకు కుర్రకారులో క్రేజ్ ఉందనేది వాస్తవం. కానీ అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తరువాత కూడా ఈ గోవా బ్యూటీ ఇంత డిమాండ్ చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారు. బోయపాటి, రాంచరణ్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











