హాట్ స్టార్ ఇలియానా హాస్పటిల్ పాలయిందా ...?
ఇలియానా హాస్పటిల్ పాలంయిందంటూ ఆమె ట్విట్టర్ లో ఓ ట్వీట్ ఉండటంతో ఫిల్మ్ సర్కిల్స్ లోనే కాక ఆమె అబిమా నుల్లోనూ టెన్షన్ ప్రారంభమైంది. ఇలియానా సిస్టర్ ఫరా ఈ ట్వీట్ చేసినట్లుగా ఆమె ట్విట్టర్ లో ఉంది. ఇలియానా తరుపున ఆమె సోదరినైన తాను ఈ ట్వీట్ చేస్తున్నానని ఈ విషయం తెలియపరిచింది. ఆ ట్వీట్ లో...మీకందరికి ఈ విషయం చెప్పాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను..ఇలియానా కొద్ది రోజుల క్రితం ఓవర్ గా ఒత్తిడికి గురి అవ్వటం వలన హాస్పటల్ పాలయింది.ఆమెను పూర్తి స్దాయి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ ,విషెష్ పంపంచండి అని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె శంకర్ దర్శకత్వంలో '3 ఇడియట్స్' తమిళ రీమేక్‌లోనూ, రణబీర్ కపూర్‌తో బాలీవుడ్‌లో 'బర్ఫీ'లోనూ నాయికగా నటిస్తోంది. అలాగే ప్రస్తుతం ఆమె వైవియస్ చౌదరి చిత్రం రేయ్ లో ఐటం సాంగ్ చేస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











