ఇలియానా ఇల్లు కబ్జా!!
సమస్యలన్నీ పాపం హీరోయిన్లకే. హీరోలకు ఉండవని కాదు కానీ హీరోయిన్లకున్నన్ని సమస్యలు వారికి ఉండవు. పోకిరి సినిమాతో తెలుగు యువత గుండెల్లో పర్మనెంట్ స్థానాన్ని పొందిన ఇలియానాకు తీర్చుకోలేని సమస్య ఇపుడు ఎదురయింది. అది ఆమె ఇంటి సమస్య. హీరోయిన్లకు ఒంటి సమస్యలుంటాయి కానీ ఇంటి సమస్యేమిటని ఆశ్చర్యపోకండి. ఇలియానా హీరోయిన్ గా వెలుగుతోంది తెలుగు పరిశ్రమలో. ఆమె సొంతూరు గోవా. షూటింగ్ ల నిమిత్తం ఆమె ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కాలం గడపాల్సివస్తోంది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా వస్తోంది. ఇంటికి తాళం వేసి వారు ఇక్కడికి వస్తే అక్కడెవరో కబ్జాకోరు ఏకంకా ఇలియానా ఇంటి స్థలంలోనే నిర్మాణాన్ని మొదలుపెట్టాడట. విశాలంగా ఉండే ఇంటి ఆవరణలో ఎవరో వచ్చి ఎంచక్కా నిర్మాణం మొదలెట్టారట. అది చూసి ఏం చేయాలో ఇలియానాకు, ఆమె తల్లికి పాలు పోవడం లేదట. ఎవరయ్యా నువ్వు అని అడుగుదామంటే లేనిపోని గొడవను తగిలించుకున్నట్టవుతుందని మిన్నకుండిపోతున్నారు. పోలీసులకు చెబుదామంటే, చెప్పిన తరువాత వారు తమ అంతు చూస్తారేమోనని తల్లీ కూతుళ్లు బెదురుతున్నారట. గోవాలో ఎవరికీ చెప్పుకోలేక టాలీవుడ్ లో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఇలియానాను కనికరించి ఎవరైనా టాలీవుడ్ హీరో హీరోయిజంతో ఆదుకుంటారా..లేక తమకెందుకొచ్చిన గొడవ అని ఊరుకుంటారా వేచి చూడాల్సిఉంది. మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రమేగినా, ఏ ప్రాంతమేగినా భూ కబ్జాల జోరే సాగుతోందయా.


Click it and Unblock the Notifications











