twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘24....’లో ఇలియానా

    By Staff
    |

    రెండు సంవత్సరాలుగా కష్టపడి తీసిన చిత్రం 'మల్లన్న" ఈ సినిమా విడుదలైన తర్వాత తెలిసింది ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా లేదని. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆశ్వాదించే పేక్షకులు, అపరిచితుడు టైపులో ఉంటుదని ఎక్స్ పెక్ట్ చేసిన ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని హీరో విక్రమ్ ఏదైనా వరైటీగా, ప్రేక్షులను ఇంప్రెస్ చేసేవిధంగా సినిమా తీయాలని మంచి కసీతో '13బి" హిందీ చిత్ర ధర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో '24" తీయబోతున్నారు. హీరో విక్రమ్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'రావణ" షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ ష్యూటింగ్ తర్వాత '24" ను ప్రారంబిస్తామన్నారు. ఈ సినిమా కధ ఒక త్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో కూడుకొందన్నారు.

    ఈ సినిమాలో ఇలియానా ప్రాధాన పాత్రను పోషించనున్నారు. ఇరవై నాలుగు అనేది ఇలియానా వయస్సు కాదు. ఈ గోవా భామ త్వరలో నటించే అవకాశాలున్న తమిళ చిత్రం పేరు ఇది. విక్రమ్ కథానాయకుడు. ఈ సినిమాకు మోహన్ నటరాజన్ నిర్మాత. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కథను హీరో విక్రమ్ కి వినిపించడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా విక్రమ్ ఇలియానాల పాత్రలు వైవిధ్యంభరితంగా ఉంటాయని సమాచారం. ఇంకా ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం హైలైట్ అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X