ఇలియానా పై దాసరి కన్ను
టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా వెలుగొందుతున్న నాయిక ఇలియానా. తన అందాలతో ప్రేక్షకులకి 'కిక్' ఎక్కించే ఇలియానా ప్రస్తుతం 'సలీం', 'రెచ్చిపో' చిత్రాలతో బిజీగా వుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓ చిత్రంలో నటించబోతోంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఇలియానాకు ఓ అరుదైన అవకాశం దక్కింది.
తాజాగా దర్శకరత్న దాసరినారాయణ రావు తీయబోతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఇలియానా నటించబోతున్నట్టు సమాచారం. దాసరి దర్శకత్వ పర్యవేక్షనలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. కథా చర్చలు పూర్తయిన ఈ చిత్రం దసరాకి ప్రారంభంకానున్నట్టు సమాచారం. ఇంత వరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఇలియానా ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
More from Filmibeat
ileana kick ravi teja saleem rechipo vishnu yvschowdary dasari narayana rao jr ntr nitin drama naidu ఇలియానా కిక్ సలీం రెచ్చిపో దాసరినారాయణ రావు ఎన్టీఆర్ నితిన్ విష్ణు


Click it and Unblock the Notifications











