జూ ఎన్టీఆర్ తో అందులో మిస్ అయినా !
ఎన్టీఆర్ తో 'రాఖీ" లో నటించిన గోవా బ్యూటి ఇలియానాకి అతనితో రెండోసారి నటించే అవకాశం దక్కినట్టే దక్కి చేజారింది. ఓ షూటింగ్ లో గాయపడి చాలా కాలం బెడ్ రెస్ట్ కే పరితమైన ఇలియానాని వినాయక్, ఎన్టీఆర్ ల సినిమా నుంచి తొలగించారు. ఆమె స్థానంలో నయనతార కథానాయికగా ఎంపికయింది. అయితే ఎన్టీఆర్ తో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నా, వెంటనే నందమూరి ఎన్టీఆర్ హీరోగా కంత్రి సినిమాకి దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ తాజా మరోసారి ఎన్టీఆర్ తో కొత్త సినిమాకి సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ చిత్రంలో ఇలియానాకి అవకాశం దక్కింది. 'కంత్రి" కాంబినేషన్ లో తెరకెక్కే మలి చిత్రంలో ఇలియానా కథానాయికగా ఎంపికయినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో తదుపరి చిత్రం చేస్తున్నట్టు ఇలియానా కూడా పేర్కొంది. నందమూరి ఎన్టీఆర్ కు వున్న క్లాస్ అండ్ మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి 'శక్తి" వంతమైన టైటిల్ పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై 'శక్తి" అనే టైటిల్ రిజిష్టర్ చేయడంతో అది ఈ సినిమాకే అని అనుకుంటున్నారు. ఇంకా ఈ టైటిల్ ను అధికారికంగా ఖరారు చేయలేదు.


Click it and Unblock the Notifications











