టాలీవుడ్ హాట్ గర్ల్ ఇలియానా ఓ సాంగ్ షూటింగ్ లో ఉండగా కుప్పకూలిపోయింది.చూస్తే ఆమె కుడి కాలి జాయింట్ వద్ద నరం పట్టు తప్పింది. నెప్పితో గిలగిల్లాడుతున్న ఆమెను వెంటనే అపోలో హాస్పటిల్ లో చేర్చారు. ట్రీట్ మెంట్ అనంతరం డాక్టర్స్ కొద్ది రోజులు బెడ్ రెస్ట్ కావాలని సూచన చేసారు. వెంటనే ఆమె షూటింగ్ కి బై చెప్పి ముంబయి వెళ్ళిపోయింది. దాంతో మరో వారం దాకా ఆమెతో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు డేట్స్ మార్చుకోవాల్సిన స్ధితి వచ్చింది. ఇదంతా మంగళవారం నాడు రాత్రి జరిగింది. పరుచూరి మురళి దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె విష్ణు సరసన సలీం,ఎన్టీఆర్-వి వి వినాయిక్ సినిమా,పరుచూరి మురళి సినిమా,రవితేజ-సురేంద్రరెడ్డి ల కిక్ సినిమాలో చేస్తోంది.