ఇలియానా అందం నన్ను పిచ్చేక్కెలా చేసిందంటున్న యూత్ హీరో
కుర్రకారుకు బక్కనడుము ఇలియానా అంటే మహా క్రేజ్ అన్నది తెలిసిందే. సినిమా హీరోకూడా కుర్రవాడే కాబట్టి... వరుణ్ సందేశ్ ఇలియానాపై మోజు బెడ్‌రూమ్ దాకా వెళ్శిందని సమాచారం. "దేవదాసు" చిత్రంలో ఆమె అందాల్ని చూసి మనసు పారేసుకున్న వరుణ్ సందేశ్ బెడ్‌రూమ్‌లోఇలియానా ఫోటోలు పెట్టుకోని మరీ తపించిపోతున్నాడంట.
హ్యాపీడేస్‌లో హీరోగా చేసినప్పటి నుంచి ఆ పిచ్చి మరింతగా ముదిరింది. ఎప్పుడూ ఊహాల్లో విహరిస్తుంటాడని వరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. వేరే హీరోయిన్లతో చిత్రాల్లో నటించినా సన్ననడుము ఇలియానా అంటేనే తనకు ఇష్టమని తరచూ ప్రస్తావిస్తుంటాడట వరుణ్. ప్రస్తుతం అగ్రహీరోల సరసన మాత్రమే నటిస్తున్న ఇలియానా ఏదో ఒకనాటికి తనతో కూడా చేయబోదా అని ఆశగా ఎదురుచూస్తున్నాడట ఈ కుర్రహీరో.
ఇది ఇలాఉండగా యూత్ హీరో వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య హీరో హీరోయిన్లుగా శివ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ మరియు మూన్ వాటర్ పిక్చర్స్(ప్రై) లిమిటెడ్ పతాకంఫై రమణ సాల్వ దర్శకత్వంలో యువ నిర్మాతలు శివ, మహి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం 'కుదిరితే కప్పు కాఫీ'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అబ్బాయి యోగేస్వర్ శర్మ అందించిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటల్ని దర్శకుడు రమణ సాల్వ అద్భుతంగా పిక్సరైజ్ చేశారు.


Click it and Unblock the Notifications











