ఇక్కడ ఎవరూ మిస్టర్ పర్‌ఫెక్ట్ కాదు...తేల్చి చెప్పిన ఇలియానా
శక్తి, నేను నా రాక్షసి చిత్రాలు ఫ్లాపులతో ఉన్న ఇలియానా..తన కెరిర్ ప్రారంభం రోజులను ఒక్కసారి విశ్లేషించుకుంది.." పెద్ద ఇంట్రస్ట్ లేకుండానే సినిమాల్లోకి వచ్చాను. మొదటి చిత్రంతోటే ఈఫీల్డ్ గొప్పదని తెలిసిపోయింది.దానికి కారణం ఆ సినిమా అంతలా సక్సెస్ కావడం వల్లనే అనుకుంటా. 'దేవదాసు'తో హిట్ ఆనందం కలిగిస్తే, 'పోకిరి'తో సూపర్ హిట్ నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది అంది. అలాగే ప్రారంభం రోజుల్లో తెలుగు అర్థం చేసుకోడానికి ఇబ్బందిపడేదాన్ని. ఇప్పుడు కొంచెం కొంచెంగా మాట్లాడ గలుగుతున్నా. అలాగే నాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే....ఏ విషయమైనా నాదే కరెక్టని వాదనకి దిగను. అలాగే కోపం వస్తే ఎదుటి వాళ్లమీద పడి అరవను అంది. ఇక వివాహం ప్రస్దావన వస్తే... అమ్మానాన్నలది లవ్ మ్యారేజ్. వారిలాగే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. ఇప్పటికైతే నేను ప్రేమలో పడలేదు. ఎప్పటికైనా ఎవర్నయినా ప్రేమిస్తే మాత్రం అతని బలాలతో పాటు బలహీనతల్నీ ఇష్టపడతా. ఎందుకంటే లోకంలో ఎవరూ మిస్టర్ పర్‌ఫెక్ట్ కాదు అంది. ప్రస్తుతం ఆమె శంకర్ దర్శకత్వంలో '3 ఇడియట్స్' తమిళ రీమేక్ లోనూ, రణబీర్ కపూర్‌తో బాలీవుడ్‌లో 'బర్ఫీ'లోనూ నాయికగా నటిస్తోంది. అలాగే ప్రస్తుతం ఆమె వైవియస్ చౌదరి చిత్రం రేయ్ లో ఐటం సాంగ్ చేస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











