ఆఖరకి ఇలియానా దానికి కూడా రెడీ
ఇలియానా ఐటం సాంగ్ చేయటం పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోటి రూపాయలు ఇస్తేగానీ సినిమా ఒప్పుకోనంటూ వరసగా సినిమాలు వదులుకుంటున్న ఈ భామ తుంట తుంటి కన్నడ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో లేఖా వాషింటన్, ఇషితా శర్మ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక రెమ్యునేషన్స్ విషయానికి వస్తే కన్నడ చిత్రాల బడ్జెట్ లే అంతంత మాత్రం. దాంతో ఇలియానాకు ఏ మాత్రం ఇచ్చి ఉంటారంటే తెలుగుతో పోలిస్తే తక్కువే అయ్యింటుంది అంటున్నారు. మరి ఎందుకు ఒప్పుకుందీ అంటే తెలుగులో తనకు గిరాకీ కాబట్టి ఇక్కడ పట్టుబడుతోంది..అలాగని ఖాళీగా ఉండలేదు కదా అందుకే ఒప్పుకుంది అంటున్నారు. అయితే ఇలియానా వెర్షన్ మాత్రం వేరే విధంగా ఉంది. ఆమె మాటల్లోనే 'ఛ...అలాంటి పాటలు నేనెందుకు చేస్తాను. నిజం చెప్పాలంటే అది మసాలా పాట కాదు. నాక్కూడా ఆ సినిమాలో ఓ సన్నివేశం ఉంది. అందుకు తగ్గట్టే పాట ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రత్యేక పాత్రలాంటిది. అందుకే చేయడానికి ఒప్పుకొన్నాను' అని సర్దిచెప్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











