»   » శక్తి, నేను నా రాక్షసి దెబ్బకి ఇలియానా అవుట్..సమంత దిల్ ఖుష్...

శక్తి, నేను నా రాక్షసి దెబ్బకి ఇలియానా అవుట్..సమంత దిల్ ఖుష్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా దాదాపుగా టాలీవుడ్ నుంచి ఉద్వాసనికి గురయినట్టేనని సకేంతాలు అందుతూ ఉండగా, యువ హీరోయిన్ సమంత సంబరాల్లో మునిగి తేలుతోంది. ఇలియానా తర్వాత అంత వేగంగా టాప్ కి చేరుకున్న సమంతకి ఇలియానా స్థాయి సెక్సప్పీల్ లేదు. కాజల్, తమన్నాలాంటి వారిని తట్టుకోగల శక్తి ఉన్నా ఇలియానాని మించిపోయే మేటర్ తనలో లేదని, ఆమెని పడగొట్టే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. దూకుడు హిట్టయితే ఇలియానాని పక్కకి నెట్టి ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంది.

కానీ అంతకు ముందే ఇలియానా హిట్ వికెట్ అయి వెనుదిరగడంతో సమంత హ్యాపీగా ఉంది. ఇన్నాళ్లూ అగ్ర హీరోల్లో ఎక్కువ మంది ఇలియానా వైపే మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు వాళ్లకో ప్రత్యామ్నాయం కావాలి. కాజల్ అనుష్క తదితరులు అప్పుడే బోరుకొట్టే స్టేజ్ కి వచ్చేయడంతో కేవలం రెండే సినిమాల్లో నటించి ఇంకా ఫ్రెష్ గా ఉన్న తనకే ఎక్కువమంది ఓటేస్తారని ఆమె పండుగ చేసుకుంటోంది. అందుకే కాబోలు, అల్లు అర్జున్ బద్రీనాథ్ తర్వాతి చిత్రం త్రివిక్రమం డైరెక్షన్ లో చేసే సినిమాకి ఇలియానా హీరోయిన్ అంటే సంతప్తిగా లేడని, ఆ ప్లేస్ లో సమంతని రికమెండ్ చేశాడని సమాచారం. అందుకే సీత మంచి బాలిక అని అనిపించుకునేందుకు తను నటించే సినిమాల ప్రచారంలో కూడా పాల్గొంటానని వాగ్ధానాలు కూడా చేస్తోంది. అలా చేస్తే ఇలియానా కంటే తనే చాలా బెటర్ అంటారనేది ఆమె ఎత్తులా కనిపిస్తోంది.

English summary
Goa Beauty Ileana is now in distress as she is unable to score a single success from last 2 years. Her last 2 movies Shakti and Nenu Naa Rakshasi failed at box-office. Besides that she is facing heavy competition from Kajal, Samantha, Tapsi, Tamanna etc. Currently she has only one offer in Tollywood with Allu Arjun in Trivikram direction. But the latest buzz is that Allu Arjun is fearing of flop syndrome of Ileana and want to replace with Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu