రాణాతో బిజినెస్ మొదలెట్టిన 'ఇలియానా'

By Sindhu

గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు బిజినెస్ లోకి కూడా దిగింది. హైదరాబాదు, మాదాపూర్ లోని 'ఇనార్బిట్ మాల్' లో ఒక డిజైనర్ షోరూం ని నిన్న (ఆదివారం) రాత్రి స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో హీరోలు రానా, నితిన్ కూడా పాల్గొన్నారు. ఈ షోరూం పేరు 'ఇలియానా'! దీనిని వాళ్లమ్మ సమీరా డీక్రూజ్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ, 'మా మమ్మీ డిజైన్ చేసే డ్రేసేస్ ఈ షోరూంలో దొరుకుతాయి. ఇక్కడే కాకుండా దేశంలోని పలు నగరాలలో కూడా ఇటువంటి షోరూంలు నెలకొల్పాలన్నది మా ఆలోచన"అని చెప్పింది. తల్లి సమీరా మాట్లాడుతూ, 'మా అమ్మాయి డ్రేసేస్ నేనే డిజైన్ చేస్తాను. వాటిని అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ షోరూం స్టార్ట్ చేసాం"అని చెప్పారు. ఏమైనా, రేపొకవేళ సినిమాలు తగ్గిపోతే, ఈ బిజినెస్ లో సేటేల్ అవ్వొచ్చన్న ముందుచూపుతోనే ఇలియానా ఈ వ్యాపారంలోకి దిగిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X