ము...ము..ముద్దంటే చేదుకాదంటున్న తార!
ముద్దుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే సినిమాల్లో ముద్దు సీన్లు వీలైనంత వరకు జొప్పించి ప్రేక్షకులను మెప్పించే పని చేస్తుంటారు దర్శకులు. ఇక యువతరంలో వేడిని రగిల్చే లిప్ లాక్ ముద్దుల గురించి ఎంత వర్ణించినా తక్కువే. కొంత మంది హీరోలు, హీరోయిన్లు లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోతూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కూడా. వెండితెరపై అధర చుంబనాలు బాలీవుడ్‌లో మామూలు విషయమే కానీ దక్షిణాది చిత్రాల్లో ఆ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. బికినీలు ధరించడానికి సైతం రెడీ అనే సుందరాంగులు సైతం లిప్ టూ లిప్ కిస్సులంటే ఆమడ దూరంలో ఉంటున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా, కోటికిపైగా రెమ్యూనరేషన్ తీసుకునే తారగా నెంబవర్ స్థానంలో కొనసాగిన ఇలియాన...ఈ మధ్య వరుస ప్లాపులతో అవకాశాలు లేక వెకబడి పోయింది. ఇప్పటికే బికినీ ధరించి సినిమాల్లో దర్శనం ఇచ్చిన ఇలియాన...త్వరలో ముద్దు సీన్లతో దుమ్ము రేపడానికి సిద్ధం అవుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 3 ఇడియట్స్ తమిళ రీమేక్ నన్ బన్ లో విజయ్ సరసన నటిస్తున్న ఇలియాన... ఈ చిత్రంతో దక్షిణాదిన పూర్వవైభవాన్ని పొందాలనే ఆలోచనలో ఉంది. ఇందుకోసం హీరో విజయ్‌తో లిప్‌లాక్ సీన్‌లో నటించాలని దర్శకుడు శంకర్ కోరిన వెంటనే అంగీకరించింది ఇలియానా. ఇటీవల చిత్రీకరన జరిగిన ఈ సీన్లలో మద్దు చేదు కాదు చాలా తీపి అన్న చందంగా రెచ్చిపోయి జీవించిందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
సక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో త్రీ రాస్కెల్స్ పేరుతో విడుదలవుతోంది. మరి ఈ చిత్రంతో అయినా ఇలియాన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? ముద్దు సీన్లు ఆమె కెరీర్ కు ఎంత మేరకు మద్దతు నిచ్చాయి? ముద్దుల క్వీన్ గా కీర్తి గడిస్తుంది, ముద్దుల్లో ఈవిడ సుద్ధ దండగ అనిపించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











