ప్రేమలో పడ్డాను..ఇండస్ట్రీ వ్యక్తినే..ఇలియానా
ఓ ప్రెవేట్ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేయటానికి విశాఖపట్టణం వచ్చిన ఇలియానా ప్రేమించటం తప్పేమీ కాదని స్టేట్ మెంట్ విసిరింది. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ..నేనెప్పుడూ ప్రేమను పాపం గా భావించలేదు. నా తల్లితండ్రులు కూడా ఆ విషయంలో స్వేఛ్చ ఇచ్చారు. వారు నేను ప్రేమించి,ఇష్టపడే వ్యక్తినే పెళ్లిచేసుకోమని చెప్తున్నారు. ఎరేంజెడ్ మ్యారేజ్ ల కన్నా ప్రేమ వివాహాలే బెస్ట్. ఎందుకంటే ప్రేమించుకునేటప్పుడు ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే వీలుంటుంది..టైమ్ ఉంటుంది. అదే ఎరేంజెడ్ మ్యారేజెస్ లలో ఆ అవకాశం ఉండదు. అది ఓ గాంబ్లింగ్ లాంటిది. నీ అదృష్టం బావుంటే నీకు ఫెరెపెక్ట్ పార్టనర్ దొరుకుతాడు. అంటూ సుదీర్ఘ ఉపన్యాసం అయ్యాక ఇంతకీ మీరు ఇండస్ట్రీలో ఎవరితోనన్నా ప్రేమలో పడ్డారా అన్న దానికి స్పందనగా అవును అని నవ్వుతూ చెప్పింది. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడంటారు.
ఇలియానా దేవదాసు రామ్ జల్సా పూరీ జగన్నాధ్ పవన్ కళ్యాణ్ రెచ్చిపో ఎరేంజెడ్ మ్యారేజ్ ప్రేమ ileana devadas saleem jalsa puri jagannath love arranged marriage vizag


Click it and Unblock the Notifications