ఇలియానాకి తన కొత్త నిక్ నేమ్ బాగా నచ్చుతోందంటోంది
ఇలియానాకు కొత్తగా రాక్షసి గారు అనే నిక్ నేమ్ పెట్టారు. "నేనూ నా రాక్షసి" చిత్రం షూటింగ్ యూనిట్ వాళ్ళు ఆమెకు ఆ పేరుని బహుకరించారు. ఈ నిక్ నేమ్ ని ఆమె బాగా ఎంజాయ్ చేస్తోందిట. ఈ విషయాన్ని ఆమె చెబుతూ...నన్ను కొందరు రాక్షసి గారూ అని పిలుస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చిన నిక్ నేమ్ అది. ఈ నిక్ నేమ్ వినటానికి చాలా క్యూట్ గా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఇక తన కెరీర్ గురించి చెపుతూ..మహేష్ తో మళ్ళీ ఎప్పుడు నటిస్తానా అని ఎదురుచూస్తున్నాని, అది 'త్రీ ఇడియట్స్' రీమేక్ తో తీరుతోందని అంది. అలాగే పోకిరి సమయంలో తాను చాలా సిగ్గరిని, కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందని కాబట్టి మహేష్ తో మరింత ఇంట్రాక్షన్ పెంచుకుంటానని చెప్తోంది. ఇక తనకు ఏ బోయ్ ప్రెండ్ అవసరం లేదని, తన కుటుంబం సపోర్టు ఉందని చెప్పుకొస్తోంది. ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ సరసన "శక్తి "చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











