Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ ని స్పెషల్ గా కలిసిన ఇలియానా
మహేష్ తో ఇలియానా చేసిన పోకిరి చిత్రం ఏ రేంజి విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇలియానా,పూరీ కాంబినేషన్ లో నేనూ ..నా రాక్షసి చిత్రం వచ్చింది కానీ మహేష్ తో చిత్రం రాలేదు. అయితే మరో సినిమా మహేష్ తో చేయాలని ఇలియానాకు ఆశ పుట్టినట్లుంది. ఆమె రీసెంట్ గా ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ కి హాజరైంది. అక్కడ మహేష్ తో స్పెషల్ లంచ్ తీసుకుంది. దూకుడు సక్సెస్ కు మహేష్ కు కంగ్రాట్స్ చెప్పింది. ఓ ఐదు నిముషాలు వచ్చి వెళ్లిపోదామనుకున్న ఆమె ఆ పూటంతా అక్కడే గడిపిందిట.మరో ప్రక్క పూరీ జగన్నాధ్ తో కబుర్లు చెపుతూ షూటింగ్ చూస్తూ మెచ్చుకుంటూ గడిపేసిందని చెప్తున్నారు. తెలుగులో శక్తి చిత్రం తర్వాత ఇలియానా మీద అనధికారికంగా బ్యాన్ కొనసాగుతున్న పరిస్దితి ఉంది.
ఆమె చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో ఎలాగైనా మహేష్ ప్రక్కన సినిమా ఛాన్స్ సాధించాలని ఇలా రౌండ్స్ వేస్తోందని చెప్తున్నారు.ఇక ఇలియానా ఇప్పుడు హిందీలో బర్బీ అనే చిత్రం చేస్తోంది.ప్రస్తుతం ఆమె చేస్తున్న త్రీ ఇడియట్స్ చిత్రం సైతం చేస్తోంది. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్లో శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. అలాగే ముగ్గురు హీరోలూ చాలా ఫ్రెండ్లీగా మెలిగారు. హిందీ 3 ఇడియట్స్ చూశాను. నా నటనలో కరీనా ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కరీనా చేసినట్లుగానే నేను కూడా యాక్ట్ చేస్తే ఇక సినిమా చేయడమెందుకు, 3 ఇడియట్స్ చూస్తే కరీనా శైలి కనిపిస్తుంది.నన్బన్ నా టైప్‌లో ఉంటుంది అని చెప్పింది.