కొత్త ఇలియానాను మా చిత్రంలో చూస్తారు
కొత్త ఇలియానాను తెరమీద చూస్తారు. 'నేను, నా రాక్షసి' అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తప్పక అర్థమవుతుంది అని నల్లమలుపు బుజ్జి అన్నారు. రానా, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'నేను నా రాక్షసి'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబి భవ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనూ, విదేశాల్లోనూ జరిగింది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా మీడియాను కలిసిన నిర్మాత సినిమా గురించి మాట్లాడుతూ...అన్ని వర్గాల వారినీ అలరించే సినిమా అవుతుంది. ప్రతి ఫ్రేములోనూ వైవిధ్యం కనిపిస్తుంది. పూరి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే సినిమా అవుతుంది. ఆయన తాలూకు డైలాగులు అందర్ని మెప్పిస్తాయి. ఈ సినిమాలో రాణా, ఇలియానా జంట కనులవిందు చేస్తుంది. కెమెరా పని తనం అలరిస్తుంది అన్నారు.
అలాగే ఈ చిత్రంలో విలన్ గా అభిమన్యు సింగ్ నటిస్తున్నారు. రక్త చరిత్ర చిత్రంలో బుక్కారెడ్డి పాత్రను పోషించిన ఈ నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ ప్యావరేట్ గా మారాడు..అలాగే ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్ రాథోడ్.


Click it and Unblock the Notifications











