ఇలియానాకు పాపం రెండూ మైనస్సే

By Srikanya

హైదరాబాద్ : ఒకే వారం గ్యాప్ లో తాను నటించిన రెండు చిత్రాలు విడుదల కావడం ఇలియానాకు హ్యాపీనే. అల్లు అర్జున్‌తో 'జులాయి' , రవితేజ తో 'దేవుడు చేసిన మనుషులు' నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆమెకు ఊహించినంత కిక్ ఇవ్వలేదు. దేముడు చేసిన మనుష్యులు ఆల్రెడీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. జులాయి ఓకే అనిపించుకున్నా ఆమెకు త్రివిక్రమ్ కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేసి మరీ అలాగే చూపెట్టాడు. దాంతో ఆమెకు తెలుగులో ఊహించిన క్రేజ్ రాలేదు. దాంతో ఇలియానా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

సాధారణంగా మంచి సక్సెస్‌ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. అలాంటిది వరసగా ఫెయిల్యూర్ లో ఉన్న ఆమె సన్నబడి మరీ అందం కూడా లేకుండా పోవటం ఆమెకు మైనస్ గా మారింది. అయితే ఆమె హిందీలో సినిమాలు చేస్తూండటంతో ధైర్యంగా ఉంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న బర్ఫీ చిత్రం హిట్ అయితే అక్కడ నిలదొక్కుకోవచ్చు అనే ఆలోచనలో ఉంది. మరో ప్రక్క ఆమె తమన్నా, సమంత, కాజల్‌తో విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం ఆమె తనలో గ్లామర్ తగ్గలేదని నిరూపించుకోవాల్సిన భాధ్యత ఉంది.

ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌‍కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. 'Phata Poster Nikla Hero' చిత్రం పూర్తి మాస్ మసాలా బాలీవుడ్ ఎంటర్‌టైర్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్స్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగే యంగ్ బాయ్స్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుందట. నవంబర్లో షూటింగ్ ప్రారంభించి 2013లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక పోతే ఇలియానా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బర్ఫీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధం కాబోతోంది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అపీషియల్ సమాచారం వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X