ఇడియట్స్ ఎవరో తెలియదు కానీ స్లో పాయిజన్ లా ఇలియానా...
సినిమాలు లేవు లేవు అంటునే నడుమందాల సుందరి ఇలియానా..మంచి మంచి ఛాన్స్ లు కొట్టేస్తూ తన స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మధ్య సినిమాలు లేక గోవాలో గోళ్లు గిళ్ళుకుంటుంది..అని ఇలియానా పై వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ శక్తి చిత్రంతో బిజీబిజీగా ఉన్న ఇలియానా..మరో రెండు మూడు గ్రేట్ సినిమాలకి సైన్ చేసి..స్లో పాయిజన్ లా అవకాశాలను సొంతం చేసుకుంటుంది..
ఎన్టీఆర్ తో శక్తి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తో మరోసారి వర్కింగ్ టైటిల్ ('ఖుషిగా")లో జల్సా చేసే అవకాశాన్ని దక్కించుకుంది..తాజాగా మరో అరుదైన అవకాశం ఆమె దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి..బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన '3 ఇడియట్స్" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..
ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడని వార్తులు వస్తుండగా, ఈ రెండు భాషలలో నటించే హీరోల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు..హీరోయిన్స్ లో త్రిష, ఇలియానా రేస్ లో ఉన్నా కానీ ఇలియానా మాత్రం ఈ రెండు భాషలలో నటించనుందని తాజా సమాచారం..


Click it and Unblock the Notifications











