మరో చిత్రం కమిటైన ఇలియానా..డిటేల్స్
ముంబై : గోవా సుందరి ఇలియానా బాలీవుడ్‌లో మరో అవకాశం అందిపుచ్చుకుంది. బర్ఫీతో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో నటిస్తోంది. ఇప్పుడు మూడో చిత్రం కూడా సిద్ధమైంది.
త్వరలో ఆమె సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించబోతోంది. ఈ సినిమాకి రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె. సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. సైఫ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో చిత్రీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.
సైఫ్‌తో ఇప్పటికే రాజ్, కృష్ణలు 'గో గోవా గాన్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 10న విడుదలవుతుంది. మన రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు దర్శకులు తెలుగులో 'డి ఫర్ దోపిడి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వరుణ్ సందేష్, సందీప్ కిషన్, మెలని, నవీన్, రాకేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం 'డి ఫర్ దోపిడి'. దొబ్బడానికి? దొబ్బించుకోడానికా? అనేది సబ్ టైటిల్. హిందీలో '99', 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











