ఇలియానా రాక ఖరారు.. ఇప్పటికీ అదే క్రేజ్, స్వాగతం పలికిన మైత్రి మూవీస్ !
Recommended Video

నడుము సుందరి ఇలియానాకు టాలీవుడ్ లో క్రేజ్ తగ్గలేదు. ఇలియానా ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించిందంటే అందుకు కారణం టాలీవుడ్ చిత్రాలే అని చెప్పొచ్చు. పోకిరి చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ గోవా బ్యూటీ తనవైపుకు తిప్పేసుకుంది. ఆ తరువాత జల్సా, జులాయి, కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
పెరిగిన క్రేజ్ తో ఇలియానా బాలీవుడ్ కు వెళ్లి ఆశాభంగం చెందిన సంగతి తెలిసిందే. ఇలియానాకు బాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు. ఆరా కోరా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది. తాజగా ఇలియానాకు మరో గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది. శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో రూపొందబోయే అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించే అవకాశం ఇలియానాకు వచ్చింది. మంచి అవకాశం రావడంతో ఇలియానా వెంటనే ఒప్పేసుకుంది.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మైత్రి మూవీస్ సంస్థ ఇలియానాని టాలీవుడ్ రీ ఎంట్రీకి స్వాగతం పలికింది. దర్శకుడు శ్రీనువైట్ల కూడా ఐలియానా రీఎంట్రీని ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు. రవితేజ సరసన ఇలియానా ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించింది. ఇలియానా, రవితేజ కాంబినేషన్ లో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











