తన అందం గురించి పచ్చి నిజం చెప్పిన ఇలియానా
మమ్మల్ని రోల్ మోడల్ పెట్టుకుని అందంగా మారాలని మాత్రం మీరు అనుకోవద్దు. ఇవన్నీ పైపై పూతలు మాత్రమే. మాకన్నా చాలా మంది అమ్మాయిలు మేకప్ లేకుండానే, సహజమైన సౌందర్యంతో కనిపిస్తుంటారు అంటూ ఇలియానా తమలాంటి హీరోయిన్స్ అందం గుట్టు విప్పి చెప్పింది. అలాగే తన సౌందర్య రహస్యం చెపుతూ...యోగా, ధ్యానం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం ఇవేమీ కావు. ఓ చిరునవ్వు...మన మొహాలు మీద ఉండాలి అంతే అంది. అలాగే చాలామంది అందం కోసం ఏవేవో చేస్తారు. క్రీములూ, చిట్కాలూ అంటూ పరుగులు తీస్తారు. నా దృష్టిలో ఇవన్నీ అనవసరం. మనసారా నవ్వితే ఆ కాంతి ముఖంలో ప్రతిఫలించేలా చేస్తుంది. మరింత అందం తీసుకొస్తుంది అని చెప్పింది ఇలియానా. ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో ఎన్టీఆర్ సరసన చేస్తోంది. అలాగే మహేష్,శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ లోనూ ఆమె కమిటయ్యింది. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న నేనూ...నా రాక్షసి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











