ఠాగూర్ హిందీ రీమేక్‌లో ఇలియానా
హైదరాబాద్: బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌత్‌లో ఒకప్పుడు నెం.1 హీరోయిన్‌గా రాణించినప్పటికీ ఇలియానాను ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించాయి. ఈ నేపథ్యంలో అనుకోకుండా వచ్చిన బర్ఫీ అవకాశంతో బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ గోవా బ్యూటి సుడి తిరిగిందనే చెప్పాలి.
బర్ఫీ తర్వాత షాహిద్ కపూర్ సరసన 'పతా పోస్టర్ నిక్లా హీరో' సినిమాలో అవకాశం దక్కించుకున్న ఇలియానా...తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఠాగూర్ సినిమాకు రీమేక్‌గా హిందీలో రూపొందుతున్న 'గబ్బర్' సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది.
అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'గబ్బర్' చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది. అక్షయ్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం అంటే... ఇలియానాకు ఇకపై తిరుగు లేనట్లే అంటున్నారంతా.


Click it and Unblock the Notifications












