పవన్‌తో జల్సా చేసేది నేను అంటున్న హాటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి తర్వలో సీక్వెల్ రూపొందబోతోంది. ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తూ ఆచిత్రంలో నటించేది నేనే అని స్పష్టం చేసింది హీరోయిన్ ఇలియానా.
ఇలియానా తన బాలీవుడ్ తొలి చిత్రం 'బర్ఫీ' షూటింగులో పాల్గొన్న సందర్భంగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీతో ఆమె మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఆ చిత్రం పేరు ఇంకా ఖరారు కాలేదని, ఈ ప్రాజక్టుకు సంబంధించి ఫార్మాలిటీ తాను ఇంకా పూర్తి చేయాల్సి ఉందని చెప్పింది.
ప్రస్తుతం ఇలియాన తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న 'జులాయి' చిత్రంలో అల్లు అర్జున్‌తో కలసి నటిస్తోంది. జూన్ 10న ఈచిత్రం ఆడియో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. . జూన్ 21 లేదా 22న ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. రాధాకృష్ణ ఈచిత్రాన్ని హారిక హాసిని ప్రొడక్షన్స్ బేనర్ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పకులు.
ఈ చిత్రంతో పాటు ఇలియాన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ సరసన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం హీరో, హీరోయిన్లు రవితేజ, ఇలియానాలపై ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు చకచకా జరిగి పోతున్నాయి. ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ మొత్తం పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ జరుగాల్సి జరుగుతోంది.


Click it and Unblock the Notifications











