టాలీవుడ్‌లోకి ఇలియానా రీ ఎంట్రీ.. క్రేజీ మూవీలో ఆఫర్.. ఆ హీరోతో నాలుగోసారి!
నడుము సుందరి ఇలియానాని మరచిపోవడం తెలుగు యువతకు కష్టమే. దేవదాసు, పోకిరి, కిక్ వంటి చిత్రాలతో ఇలియానా ఒక ఊపు ఊపింది. ఇలియానా సోయగాలకు కుర్రాళ్ళు మొత్తం ఫిదా అయిపోయారు. రవితేజ సరసన నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఇలియానా చివరి సారి తెలుగులో నటించింది.
ఆ చిత్రం తరువాత ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. సౌత్ లో విజయం సాధించినంతగా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఒకటి అరా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది. మంచి అవకాశం వస్తే తెలుగులోకి రీ ఎంట్రీ ఇద్దామనే ఆలోచనలో ఇలియానా ఉంది. ఆ సమయం రానే వచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కబోయే అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో ఇలియానాకు అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైనతే ఇలియానా రీ ఎంట్రీకి సుమగం అయినట్లే. ఇలియానా ఇప్పటికే మూడు చిత్రాల్లో రవితేజ సరసన నటించింది. ఖతర్నాక్, కిక్ , దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లో రవితేజతో రొమాన్స్ చేసింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా మరో హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











