»   » రాత్రి పూట అండర్ వేర్ మాత్రమే వేసుకుని ఇలియానా ఏ చేస్తుంది?

రాత్రి పూట అండర్ వేర్ మాత్రమే వేసుకుని ఇలియానా ఏ చేస్తుంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ఎంజాయ్ చేయడం కోసం కొంత మంది చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి. హీరోయిన్ ఇలియానాకు కూడా ఇలా ఎంజాయ్ చేసే అలవాటు ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

‘నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒంటరిగా ఇంట్లో ఉండటం. మిడ్ నైట్ బట్టలిప్పేసి కేవలం అండర్ వేర్ మాత్రమే వేసుకుని టీవీ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ నచ్చిన ఫ్రోగ్రామ్స్ చూడటం అంటే చాలా ఇష్టం.' అంటూ ట్వీట్ చేసింది.


ఎట్టకేలకు ఇలియానాకు స్టార్ హీరోతో సెట్టయింది

ప్రియుడితో అయితే ఇలా....
ఆ మధ్య ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియుడితో నువ్వు కావాలనుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా ఆసక్తికరంగా స్పందించింది. ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ ఎంజాయ్ చేయాలి. అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ అనుభూతి పొందాలి' అంటూ ఇలియానా మనసులోని మాటను బయట పెట్టింది.

 Ileana's fav things in nights

సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా తర్వాత బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చేసిన తొలి సినిమా ‘బర్ఫీ' మంచి విజయం సాధించినప్పటికీ అమ్మడి కెరీర్ మాత్రం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. 2015లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇలియానా చేయలేదు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చిత్రం ‘రుస్తుం'లో నటిస్తోంది.

English summary
"One of my fav things about living alone is midnight snacks on my couch in front of the TV in my underwear" Ileana tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu