Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
ఇలియానా... ఒకప్పుడు కుర్రకారును ఊపేసిన పేరిది. దేవదాసుతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనతికాలంలోనే స్టార్‌డమ్ సంపాదించింది ఈ గోవా బేబీ. అయితే కాలంకలిసిరాక ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు అడుగంటాయి. దీంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇలియానా అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు.
టాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఎదిగిన కొద్ది కాలానికే బాలీవుడ్‌లో కెరీర్‌ను వెతుక్కుంటూ వెళ్లిన ఈ గోవా బ్యూటీకి 'బర్ఫీ' రూపంలో మంచి ఆరంభం దక్కింది కానీ, ఆ తర్వాత ఆశించిన రీతిలో విజయాలు లభించలేదు. 'ఫటా పోస్టర్ నిక్లా హీరో' యావరేజ్‌గా ఆడగా, 'కందిరీగ' రీమేక్ 'మై తేరా హీరో' సైతం అదే స్థాయిలో ఆడింది.
సైఫ్ అలీఖాన్, గోవిందా కాంబినేషన్‌లో చేసిన 'హ్యాపీ ఎండింగ్' అయితే బాగా నిరాశపరిచింది. ఆ సినిమా వచ్చి సుమారు రెండేళ్లవుతోంది. 2015లో ఆమె సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌తో 'రుస్తుం' చేసింది. ఆగస్ట్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
టిను సురేశ్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓ నేవీ ఆఫీసర్ కథతో తెరకెక్కింది. ఇందులో ఇలియానా పాత్రకు మంచి ప్రాధాన్యమే ఉందని వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర రూపం ఎలా ఉంటుందో సోషల్ వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడి చేసింది. అంతే కాకుండా 'రుస్తుం' తెరవెనుక సన్నివేశాలతో కూడిన మేకింగ్ వీడియోనూ షేర్ చేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో ఉంది ఇలియానా.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టి తనదైన హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న సుందరి ఇలియానా. తెలుగుతోపాటు తమిళంలో కూడా క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గోవా గ్రీకు సుందరి ఇలియానా దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా కోటి రూపాయలు తీసుకున్న తొలి హీరోయిన్ గా హవా కొనసాగుతున్న నేపద్యంలో బాలీవుడ్ లో అవకాశాలను వెదుక్కొంటూ... వెళ్లింది.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
రెండు, మూడు అవకాశాలు రావడంతో అక్కడే కెరీర్ జోరుగా ఉంటుందని ఆశ పడింది. కానీ, వాస్తవం మాత్రం వేరేలా ఉంది. టాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఎదిగిన కొద్ది కాలానికే బాలీవుడ్‌లో కెరీర్‌ను వెతుక్కుంటూ వెళ్లిన ఈ గోవా బ్యూటీకి ‘బర్ఫీ' రూపంలో మంచి ఆరంభం దక్కింది కానీ, ఆ తర్వాత ఆశించిన రీతిలో విజయాలు లభించలేదు. ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో' యావరేజ్‌గా ఆడగా, ‘కందిరీగ' రీమేక్ ‘మై తేరా హీరో' సైతం అదే స్థాయిలో ఆడింది.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
ఇలియానా బాలీవుడ్ లో చేస్తున్న ఒకే ఒక్క సినిమా రుస్తుం. ఈ సినిమా లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. 1950 నటి కధతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో ఇలియానా ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నది. రుస్తుం ఫలితాలు ఏమాత్రం అటూఊ ఇటూ అయినా ఇలియానా కెరీర్ కి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టే..

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
చాలా కాలంగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇలియానాకు రుస్తుం రూపంలో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. నావీ అధికారి కె.యం. నానావతి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ఇలియానా ఈ సినిమా కోసం మరింత స్లిమ్‌గా తయారై గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
తన తాజా లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసింది. ఇలియానా కొత్త అవతారాన్ని చూసిన ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
ఈ సినిమా హిట్ అయితే ఇలియానా కెరీర్ మళ్ళీ ఊపందుకున్నట్టే... బాలీవుడ్ లో ఇలియానా నిలదొక్కుకోవాలంటే "రుస్తుం" హిట్ అయి తీరాలి. ఈ సినిమా మీదే అన్ని ఆశలూ పెట్టుకుంది...

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
ఒకవేళ అటూ ఇటూ అయినా అక్షయ్ తో ఇంకో సినిమా అవకాశం రావాలనుకుందో ఏమోగానీ అక్షయ్ కుమార్ ని బాగానే పొగుడు తోంది. రేపు ఏదేమైనా ఇంకొక్క చాన్స్ కోసమైనా అక్షయ్ ని వాడుకోవాలనుకుంటోంది.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
"ఓ సినిమా పూర్తయ్యాక నేను పెద్దగా ఎమోషనల్ అవను. కానీ ఈ సినిమా పూర్తయినపుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇంత భారీ సినిమాను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేసేశారో అనిపించింది. మళ్లీ ఈ సినిమా సెట్లోకి వెళ్లలేనన్న విషయం తెలిసి ఏడుపొచ్చేసింది" అంటూ అక్షయ్ ని మరీ మరీ అదే పని అన్నట్టుగా పొగిడింది.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
యాక్షన్ సినిమాలైనా, కామెడీ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలైనా తనదైన ముద్రతో ఆ సినిమాల రేంజ్ పెంచే అక్షయ్కుమార్, ఈ చిత్రంతో మరోమారు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటాడని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సో ఇలియానా హ్యాపీ నే.

ఇపుడేం కానుంది...!? పాపం ఇలియానా కెరీర్ ఆశలన్నీ అక్కడే....
విడుదలైన కాస్సేపటికే సోషల్ మీడియాలో 'రుస్తుం' టీజర్ హల్చల్ షురూ చేసింది. టిను సురేష్ దేశాయ్ ఈ చిత్రానికి దర్శకుడు. జీ టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్ట్ 12న సినిమా విడుదల కానుంది.