For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు స్టార్ హీరో మూవీలో ఇలియానా ఐటం సాంగ్!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: గోవా సుందరి ఇలియానా తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా తన హవా చాటింది. అయితే బాలీవుడ్ సినిమాలపై మోజుతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పిన ఇలియానా తొలి చిత్రం ‘బర్ఫీ'తో హిట్టు కొట్టింది.

  అయితే తర్వాత పలు అవకాశాలు వచ్చినా...అవి సరిగా ఆడక పోవడంతో ఇలియానా కెరీర్ అక్కడ డైలమాలో పడింది. అవకాశాలు కూడా బాగా తగ్గి పోయాయి. దీంతో ఆమె మళ్లీ సౌత్ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు ఇక్కడ హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడానికి మాత్రం ఎవరూ సిద్దంగా లేరు కానీ...కొందరు నిర్మాతలు ఆమెను ఐటం సాంగు కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

  వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేక ఐటెంసాంగ్స్ చేయడానికి కూడా అభ్యంతరం లేదని తేల్చిచెప్పిందట. తాజా సమాచారం ఓ అగ్రహీరో నటిస్తున్న చిత్రంలో ఇలియానా ప్రత్యేకగీతంలో నర్తించబోతున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, తెలుగుప్రేక్షకుల్లో ఈ సుందరికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కోరినంత మొత్తంలో చెల్లించడానికి సదరు చిత్ర నిర్మాత సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం.

  ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Ileana's Item Song in Telugu

  అవకాశాలు లేక పోయినా...హాట్ ఫోటో షూట్లు, పలు ఇంటర్వ్యూల్లో హాట్ అండ్ సెక్స్ టాక్ చేస్తూ మీడియాలో హైలెట్ అవుతోంది సన్ననడుము బ్యూటీ. ఆ మధ్య ఇలియానా సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మరోసారి సెక్స్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనాలిటీ, రిలేషన్ షిప్స్‌పై తన అభిప్రాయం, లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది.

  ప్రియుడితో నువ్వు కావాలనుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందన ఆసక్తికరంగా ఉంది. ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ...అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి' అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది.

  ‘ఒక మనిషిని నువ్వు నిజంగా ప్రేమిస్తే...అతను కూడా నిన్ను అంతగానే ప్రేమించే వాడు అయితే ఆ అమ్మాయి లక్కీ గర్ల్ అవుతుంది. ప్రేమికుల మధ్య సెక్స్ జరుగడం సాధారణమే. కానీ సెక్స్ జరిగినంత మాత్రాన వారి మధయ నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదు' అంటోది ఇలియానా.

  English summary
  It is learnt that Ileana gave green signal to sizzle in an item song beside a hero in Tollywood. As per reports a Tollywood producer approached Ileana for an item song and she agreed to act but reportedly demanded huge amount for that.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X