రెండు రోజులుకు ఇలియానా రేటు కోటి
ఇలియానా డిమాండ్ అయ్యిపోయింది అనుకునే వాళ్ళకు ఆమె తాజాగా కమిటైన కోటి రూపాయల డీల్ షాక్ ఇస్తోంది.కేవలం రెండు రోజులు ఆమె యాడ్ లో పాల్గొని,స్టోర్ ఇనాగరేట్ చేస్తే ఆ మొత్తం ఆమె కు చెందుతుంది.తాజాగా ఫరవెర్ కంపెని జ్యూయలరీ కోసం యాడ్ షూటింగ్ ఆమె పాల్గొని ఈ మొత్తం చేజిక్కించుకుంది.ప్యాన్ ఇండియా కమర్షియల్స్ వారి ద్వారా ఈ యాడ్ ని ఆమె చేసింది.ఆమె మేనేజర్ మాట్లాడుతూ..ఆమెకు ఇలాంటి ఆఫర్స్ చాలా వస్తున్నాయి.కానీ ఆమె వాటిలో బెస్ట్ అనుకున్నవి ఎంపిక చేసుకుని మాత్రమే షూటింగ్ లో పాల్గొంటోంది.ఈ బ్రాండ్ ద్వారా ఆమె అతి ఖరీదైన వజ్రాలను బ్రాండింగ్ చేయనుంది అన్నారు.ఇక ఇలియానా మాట్లాడుతూ..ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిస్ధితి బాగోలేదు.అందుకే అంతా బంగారం,వజ్రాలు మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే నేను ఈ యాడ్ లో చేసాను అంది.ప్రస్తుతం ఇలియానా..త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన చేస్తోంది.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది.అలాగే ఆమె శంకర్ దర్సకత్వంలో నటిస్తున్న త్రీ ఇడియట్స్ చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











