ఇలియానా, సమంత...‘బిర్యాని’ దక్కేదెవరికి?
తమిళ స్టార్ కార్తీ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆచిత్రం పేరు 'బిర్యానీ'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి హాట్ హీరోయిన్లు... ఇలియానా, సమంతలో ఎవరిని తీసుకోవాలనే దానిపై వాడి వేడిగా సంప్రదింపులు జరుగుతున్నాయి.
సమంత దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నా....ఇలియానా పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరైనా ఫర్వాలేదని మేకర్స్ భావిస్తున్నారు. అయితే వచ్చిన సమస్యల్లా ఈ ఇద్దరు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదట. మరో వైపు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణితి చోప్రాను కూడా తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
సమంత ప్రస్తుతం బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'ఈగ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని జులైలో విడుదలకు సిద్దం అవుతోంది. మరో వైపు ఆమె గౌతం మీనన్ దర్శకత్వంలో ఒకే సినిమాను మూడు బాషల్లో ముగ్గురు హీరోలతో చేస్తోంది. తెలుగులో 'ఎటో వెళ్లి పోయింది మనసు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని హీరో. మరో వైపు రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' చిత్రంతో పాటు, మహేష్ బాబు సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలోనూ నటిస్తోంది. ఇవేకాక నాగచైత్యతో ఆటో నగర్ సూర్య చిత్రంతో పాటు తమిళంలో రెండు ప్రాజెక్టులకు కమిట్ అయింది.
ఇక ఇలియానా విషయానికొస్తే...బాలీవుడ్ మూవీ బర్ఫీతో పాటు, తెలుగులో అల్లు అర్జున్‌తో జులాయి, రవితేజతో కలిసి దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటిస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయింది.


Click it and Unblock the Notifications











