'విష్ణు’తో ఇలియానా రహస్యాలు!

By Sindhu

ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సలీమ్ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. విష్ణవర్థన్-ఇలియానా జంటగా దర్శకుడు వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో విష్ణు గెటఫ్ ప్రత్యేక ఎట్రాక్షన్ కానుంది. ఇటీవల పలు సినిమా ఫంక్షన్లకు అదే గెటఫ్ తోనే ఆయన దర్శనమిచ్చాడు. మెన్న ఆ మధ్య ఒక ఇంటర్య్వూలో హాట్ గర్ల్ ఇలియానా తన ఆరోగ్య రహస్యాలతో పాటు తను పాటించే చిట్కాలను సైతం విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మంచు విష్ణువర్ధన్ బాబుకు విడమరిచి చెప్పానని ఇలియానా అంటోంది. 'సలీమ్" చిత్రం షూటింగ్‌లో తామిద్దరం మరింతగా దగ్గరయ్యామని చెపుతోంది. ఇంతకీ ఏ విధంగా దగ్గరయ్యారో చెప్పమంటే మాత్రం కస్సుమంటోంది.

అయితే, ఇటీవల ఇలియానా తన మనస్సులోని కొన్ని విషయాలను బయటపెట్టింది. ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల లాభమేమిటనీ మొదట్లో అనుకునేదాన్ని. అలాగే, గ్రీన్ టీ తాగడం వల్లే ఏంటబ్బా ఉపయోగం అనే ఆలోచన వచ్చేది. అయితే, ఈ రెండు పనులు చేస్తే ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే పక్షుల కిలకిలరాగాలు, బేర్ ఫ్రూట్స్‌తో పచ్చటి గడ్డిమీద వాకింగ్ చేయడం, యోగా చేయడం వంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. అందుకే 'సలీమ్" చిత్రంలో ఏమాత్రం చిన్నపాటి విరామం లభించినా వెంటనే గ్రీన్ టీ తయారు చేయించుకుని సేవించేదాన్నని చెపుతోంది. దీనివల్ల లాభ నష్టాలను హీరో విష్ణుకు చెప్పేదాన్నని, దాంతో ఆయన కూడా తననే ఫాలో అవుతున్నాడని ఇలియానా చెపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X