»   » ఇలియానా రాయల్ లుక్, ఎవరికీ నచ్చట్లా!(ఫోటోలు)

ఇలియానా రాయల్ లుక్, ఎవరికీ నచ్చట్లా!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బక్క పలుచగా ఉన్నప్పటికీ....నాజూకైన నడుము అందాలు, ఒంపుసొంపుల్లో తొనికిసలాడే సెక్సీనెస్‌కు తోడు ఆకట్టుకునే ఫిజిక్‌తో 'పోకిరి' సినిమా తర్వాత యూత్‌కు ఆరాధ్య తారగా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. అప్పట్లో అందమంటే ఇలియానాదే అంటూ చాలా మంది ప్రశంసించారు కూడా. అందుకు తగిన విధంగానే అమ్ముడు కూడా వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్‌‌గా మారింది.

అందం విషయంలో ఇలియానాను తలదన్నే హాట్ బ్యూటీస్ తెరంగ్రేటం చేయడంతో రాను రాను సౌత్‌‌లో ఇలియానా అందాలకు గిరాకీ తగ్గడం మొదలైంది. దీనికి తోడు వరుస ప్లాపులు కూడా ఇలియానా ఇమేజ్‌ను తగ్గించేసాయి. ఇదే సమయంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయి అక్కడ బిజీ అయిపోయింది ఈ గోవా బ్యూటీ.

ఇలియానా నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'బర్పీ' హిట్టవడం కలిసొచ్చింది. ఇప్పుడు పలు చిత్రాల్లో బిజీగా గడుపుతోంది. అయితే దక్షిణాదిన ఉన్నపుడు ఇలియాన లుక్‌కి...ఇపుడు బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత ఇలియానా లుక్‌కి చాలా తేడా వచ్చింది. నిండైన అందాలను కోరుకునే సౌత్ ప్రేక్షకులు....ఇప్పుడు బాలీవుడ్లో ఇలియానా మరింత బక్కపలుచగా మారడాన్ని ఇష్ట పడటం లేదు.

 వెర్వ్ మేగజైన్ కోసం

వెర్వ్ మేగజైన్ కోసం

వెర్వ్ మేగజైన్‌ సెప్టెంబ్ నెల ఎడిషన్‌పై ఇలియానా రాయల్ లుక్‌తో దర్శనం ఇచ్చింది. అయితే ఇలియానా ఫేసు చాలా డల్ గా ఉందని, లుక్ కూడా పేలగా ఉందని అని విమర్శిస్తున్నారు ఆమె అభిమానులు.

సౌత్ సినిమాలకు దూరమైంది

సౌత్ సినిమాలకు దూరమైంది

బాలీవుడ్ బాట పట్టిన తర్వాత ఇలియానా సైత్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమె చివరి సారిగా తెలుగులో ‘జులాయి' చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఒక్క సౌత్ సినిమాకు కూడా సైన్ చేయలేదు.

బర్ఫీ తర్వాత వరుస అవకాశాలు

బర్ఫీ తర్వాత వరుస అవకాశాలు

బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ చిత్రం హిట్ కావడంతో ఆమె దశ తిరిగింది. వరుస అవకాశాలు ఆమెను వరించాయి. తొలి చిత్రంతోనే బెస్ట్ ఫిమేల్ ఎంట్రీ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం ఇలియానా మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. పతా పోస్టర్ నిక్లా హీరో, హాపీ ఎండింగ్, మే తేరా హీరో అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో పతా పోస్టర్ నిక్లా హీరో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మిగతా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

పతా పోస్టర్ నిక్లా హీరో

పతా పోస్టర్ నిక్లా హీరో

పతా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో ఇలియానా షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. రాజ్ కుమార్ సంతోషి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేదీన చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సైఫ్‌తో హ్యాపీ ఎండింగ్

సైఫ్‌తో హ్యాపీ ఎండింగ్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి హ్యాపీ ఎండింగ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది ఇలియానా. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వం వహించనున్నారు.

మే తెరా హీరో

మే తెరా హీరో

మే తెరా హీరో చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావత్‌తో కలిసి ఇలియానా నటిస్తోంది. ఈచిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మాత. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Ileana D'cruz sizzles on Verve Magazine Cover of September 2013. Ileana D'Cruz is an Indian film actress, who predominantly appears in Telugu movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu