'శక్తి' స్పెషల్ ...శ్రీదేవిని తలపించే గెటప్ తో ఇలియానా
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దాన్ని చూసినవారికి ఎవరికైనా జగదేక వీరుడు-అతిలోక సుందరిలోని శ్రీదేవి గెటప్ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంకూడా సోషియో ఫాంటసీ కావటం, అశ్వనీదత్ నిర్మాత కావటంతో ఈ రకమైన గెటప్ ని వేసారని ఫిల్మ్ సర్కిల్స్ వినపడుతోంది. ఇక ఈ చిత్రం టైటిల్ కు తగ్గట్టే ఎన్టీఆర్ శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టే చిత్రమిదిని అశ్వనీదత్ చెప్తున్నారు. కథానుసారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కీలక ఘట్టాలు తెరకెక్కించాం. విదేశాల్లోని కొన్ని అరుదైన లొకేషన్లనూ తెరపై చూపిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 27న పాటల్ని విడుదల చేస్తారు. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











