పీల్డ్ లో నాకు చేదు అనుభవాలు చాలానే... ఇలియానా
ఇలియానా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్ళు పైనే అయింది. ఈ సమయంలో ఆమె కొన్ని తీపి గుర్తులు తో పాటు చేదు అనుభవాలను ఎదుర్కొన్నానంటున్నారు. అవి ఆమె మాటల్లోనే..చేదు అనుభవాలు అంటే చాలానే ఉన్నాయి. నేను పరిశ్రమకి వచ్చిన కొత్తలో 'ఇలియానా.. షాట్ రెడీ' అని పిలిచేవాళ్లు. ఇప్పుడు ఇలియానాజీ అనో ఇలియానా మేడమ్ అనో, పిలుస్తున్నారు. జస్ట్ మూడే మూడేళ్లల్లో వచ్చిన ఈ మార్పు తల్చుకుంటే నాకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంటుంది. ఇప్పుడందరూ గౌరవమర్యాదలిస్తుంటే ఆనందంగానే ఉంది. అయితే ఒకప్పుడు చిన్నచూపు చూసేవాళ్లు. ఆ సమయంలో నేను ఒకింత 'ఎమోషన్'కి గురయ్యేదాన్ని. ముక్కుసూటిగా మాట్లాడటం నాకు అలవాటు. ఇండస్ట్రీలో అలా ఉంటే నెగ్గుకు రావడం కష్టం. అయినా నా పద్ధతిని మార్చుకోలేదు. ప్రతిభతో అన్నింటినీ జయించవచ్చనే లక్ష్యంతో కృషి చేశాను. అది ఫలించింది. ప్రస్తుతం వచ్చిన పేరుని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతున్నాను అంటోంది ఇలియానా. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా చేసిన సలీం చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











