ఎన్టీఆర్ తో కలిసి చరిత్ర సృష్టిస్తానంటున్న హీరోయిన్
ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. చరిత్ర సృష్టించే విజయాన్ని సాధిస్తుందీ సినిమా' అని నమ్మకం వ్యక్తం చేస్తోంది ఇలియానా. తాను ప్రస్తుతం చేస్తున్న 'శక్తి' చిత్రం గురించి ఇలియానా ఇలా చెప్పుకొచ్చింది. అలాగే..."తారక్‌తో నేను చేస్తున్న సెకండ్ మూవీ ఇది. తాను గొప్ప నటుడు. 'రాఖీ' చేస్తున్నప్పుడే తనతో చేయడానికి ఎంతో కష్టపడ్డా. అందుకే ఆ సినిమా...నటిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రేపు 'శక్తి' కూడా నాకు ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెడుతుంది అని మురసిపోతోంది. ఇక ఇలియానా..ప్రస్తుతం...బాలీవుడ్ చిత్రాలు 'లవ్ ఆజ్ కల్', 'త్రీ ఇడియట్స్', 'ఫ్యాషన్' చిత్రాల్లో రీమేక్ లలో నటిస్తోంది.
'లవ్ ఆజ్ కల్' చిత్రం పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని గణేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే 'త్రీ ఇడియట్స్' చిత్రం తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలోనూ మహేష్ బాబుతో ఈ ఇలియానే జత కట్టబోతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ గోవా బ్యూటీ ఒప్పుకున్న మరో రీమేక్ 'ఫ్యాషన్'. ఇది కూడా బాలీవుడ్ నుంచి తెలుగు, కన్నడ భాషలకు పున:నిర్మాణం జరుగుతున్న చిత్రమే. ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











