ఆ సినిమా చేయటం కోసం ఆతృతగా ఉన్నా...ఇలియానా
నా ఫేవరెట్ హీరోయిన్స్ లో కరీనా కపూర్ ఒకరు. ఇప్పుడు ఆమె చేసిన పాత్రను నేను చేయబోతుండటం చెప్పలేనంత సంతోషాన్నిస్తోంది. ఎంతో థ్రిలింగ్‌గా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్తుందా... అని కూడా ఆతృతతో ఉన్నాను అంటోంది ఇలియానా. ఆమె తాజాగా త్రీ ఇడియట్స్ చిత్రం కమిటయ్యారు. ఈ సినిమా తెలుగు,తమిళ బాషల్లో ఒకేసారి ప్రారంభంకావటం,శంకర్ దర్సకత్వం, పోకిరి తర్వాత మహేష్ కాంబినేషన్ ఆమెను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. అందుకే తాను ఈ చిత్రాన్ని ఇప్పటికి రెండుసార్లు చూసానంటోంది. అలాగే త్రీ ఇడియట్స్ లో కరీనా ఎక్స్‌ట్రార్డనరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పెర్‌ఫామ్ చేయగలనని నమ్మకం నాకుంది. అయితే నేను ఆమెను ఇమిటేడ్ చేయను. అనుకరించడం నాకు చేతకాదు అంది. ఈ చిత్రం తమిళంలో కూడా నాకు బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాను అంటోంది. ఆమె కోరిక తీరాలని కోరుకుందాం. ప్రస్తుతం ఇలియానా..ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలోనూ, రానా సరసన నేనూ నా రాక్షసి చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











