పవన్, మహేష్ అలా...ఎన్టీఆర్ ఇంకోలా: ఇలియానా
తెలుగు స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చాలా రిజర్వడ్ గా ఉంటారు. ఇతరుల పనిలో జోక్యం చేసుకోరు. తమ పని తాము చేసుకుపోతారు. ఎన్టీఆర్ అంతరితోనూ త్వరగా కలిసిపోతాడు. తనతో పనిచేయటం చాలా సరదాగా ఉంటుంది. ఇక తరుణ్ జోక్స్ వేసి అందరినీ నవ్విస్తాడు. అతనితో ఉంటే కాలేజ్ డేస్ గుర్తు వస్తాయి. ఇలా ఒక్కో హీరో ఒక్కో తరహాలో ఉంటారు. వాళ్ళందరితో కలిసి పనిచేయటం చాలా హ్యాపీగా ఉంటుంది...అంటూ తను పనిచేసిన హీరోల గురించి స్టార్ హీరోయిన్ ఇలియానా చెప్పుకొచ్చింది. ఇక దర్శకులలో త్రివిక్రమ్ నాకు మంచి ప్రెండ్ అని వివరించింది. అతని ఫ్యామిలీతో మాత్రం క్లోజ్ గా ఉంటాను అంది.
ఇక తన జీవితంలో చేదు అనుభవం ఖతర్నాక్ చిత్రం అంటూ చెప్పుకొచ్చింది. ఆ చిత్రం రిలిజైన తర్వాత చూసి దాదాపు ఏడ్చేసాను.కొన్ని కెమెరా యాంగిల్స్ అస్సలు బాగోలేవు. ఆ సినిమా ఎందుకు చేశారని చాలా మంది ఎందుకడిగారో అప్పుడర్ధమైంది నాకు..అంటూ గతన్ని తవ్వుకుంది ఇలియానా. రవితేజ కాంబినేషన్ లో చేసిన ఖతర్నాక్ చిత్రం తర్వాత తాను కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానంటూ లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. ఒక్కోసారి సబ్జెక్టు విన్నప్పుడు ఒకలా ఉంటుంది. సినిమా తీసాక మరోలా ఉంటుంది. దానికి ఇలాంటి ఖతర్నాక్ ఉదాహరణలు చాలా ఉంటాయి అంది.


Click it and Unblock the Notifications











