ఇలియానాకి స్వీట్ న్యూసా.., షాకింగ్ న్యూసా..!?
ప్రస్తుతం వినాయక్ డైరెక్షన్ లో 'బద్రీనాథ్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోంది. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై దీనిని డి.వి.వి దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం షూటింగును మే నెల నుంచి జరపడానికి షెడ్యుళ్ళు వేస్తున్నారు. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తుంది. ఇందులో నటించడానికే ఇలియానా రెండు కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి.
కాగా ఈ రోజు 'శక్తి" రిలీజ్ కావడంతో ఇలియానా చాలా టెన్షన్ పడుతోంది. టాలీవుడ్ లో తన పొజిషన్ ని డిసైడ్ చేసేది కావడం వల్లే ఇంతకుముందు లేనంతగా ఈ సినిమాకి ఇలియానా అటెన్షన్ లోకి వచ్చేసింది. తమిళం, హిందీలో అవకాశాలు వస్తున్నప్పటికీ ఇలియానాకి తెలుగులో ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉంది. మళ్లీ అక్కడ మొదట్నుంచీ బిల్డ్ చేసుకుని నటన కొనసాగించే అవకాశాలు కూడా తక్కువే.
అందుకే టాలీవుడ్ లో గ్రిప్ కోల్పోకుండా ఉండేందకు ఇలియానా 'శక్తి" సినిమాతో మరో భారీ హిట్ కొట్టాలని చూస్తోంది. ఖతర్నాక్, రాఖీ, టైమ్ కే డల్ అయినా కానీ జల్సా, కిక్ సినిమాలతో ఉనికి నిలుపుకున్న ఇలియానా ఆ తర్వాత రెచ్చిపో, సలీమ్ వంటి డిజాస్టర్స్ లో నటించింది. ఇప్పుడు శక్తిలాంటి భారీ సినిమా కూడా అంచనాలకి తగ్గట్టు లేకపోతే ఇలియానా ప్రాబ్లెమ్ లో పడిపోతుంది. అందుకే శక్తి సినిమాకి అంతగా టెన్షన్ పడుతున్న ఇలియానాకి స్వీట్ న్యూసో, షాకింగ్ న్యూసో మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది...


Click it and Unblock the Notifications











