twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నా: ఇలియానా

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''డబ్బు కోసం కాదు, సంతృప్తి కోసమే సినిమాలు చేస్తున్నాం.. అని ఎవరైనా చెబితే చెప్పొచ్చు. నాకు మాత్రం డబ్బుల విలువ తెలుసు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నా. అందుకే రెమ్యునేషన్ ఎంత? అనే లెక్కలు కూడా వేసుకొంటా'' అంటోంది ఇలియానా. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇలియానాకి 'బర్ఫీ'తో మంచి ఫలితమే దక్కింది. అక్కడ నుంచి మరిన్ని అవకాశాలు అందుకొనే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ మంచి రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోంది అంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇలా స్పందించింది.

    అలాగే...''ఆరేళ్లుగా దక్షిణాదిన సినిమాలు చేస్తూనే ఉన్నా. ఈ స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు పెద్ధ మొత్తంలో పారితోషికం అందుకొంటున్నానంటే.. అదంతా నా కష్టానికి తగిన ఫలితమే. ఊరికే ఎవరూ ఇవ్వడం లేదు. 'ఇలియానా కోటి రూపాయలకు పైగానే తీసుకొంటుందట' అనే మాటలు విన్నప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది'' అని చెబుతోంది ఇక ''బర్ఫీ విజయం సంతోషాన్నిచ్చింది. నాకు అన్ని భాషలూ ఒక్కటే. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిపెడుతున్నా. బికినీ వేయడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ.. నా శరీరతత్వానికి బికినీ నప్పుతుందో లేదో సరిచూసుకోవాలి'' అంది.

    సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా...బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రా, ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈచిత్రం ఒక చెవిటి, మూగ వ్యక్తి కథ. రణబీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. రణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్ పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు. జిల్మిల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటకు మంచి మార్కులు పడ్డాయి. సౌత్ లో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న ఇలియానా ఈ చిత్రంలో శృతి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    ఇక ఇలియానా సినీ కెరీర్ విషయానికొస్తే...ఇటీవల ఆమె అల్లు అర్జున్‌తో కలిసి నటించిన 'జులాయి' చిత్రం సూపర్ హిట్ అయింది. దానికంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజతో కలిసి ఇలియానా నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ఇలియానా ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌‍కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    English summary
    Despite allegations surrounding her attitude, Ileana D'Cruz has managed to top the remuneration chart. The Goan beauty has overtaken Southern actresses like Trisha Krishnan and Anushka Shetty to become the highest paid lass of the regional film industry. Here we bring you the remuneration list of top five highly paid actresses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X