twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలియానా ఈ జనరేషన్ కి సరిపోయే ‘మందాకిని’...!?

    By Sindhu
    |

    మందాకిని... ఈ పేరు వినగానే 'రామ్ తేరీ గంగా మైలీ" చిత్రంలో ఆమె తెల్ల చీర ధరించి జలపాతంలో జలకాలాడే సన్నివేశం గుర్తుకు రావడం ఖాయం. అప్పట్లో ఈ సన్నివేశం పలు వివాదాలకు గురయ్యింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఈమెకు సత్సంబంధాలుండేవని కూడా అప్పట్లో ఓ వార్త ప్రసారమైంది. మొత్తం మీద మందాకిని వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం వివాదాలమయం అని చెప్పొచ్చు. ఇప్పుడింత సుదీర్ఘంగా మందాకిని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే...ఇప్పుడింత సుదీర్ఘంగా మందాకిని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ముంబయ్ అండర్ వరల్డ్ నేపథ్యంలో ఇటీవల ఏక్తాకపూర్ నిర్మించిన 'ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్"లో దావూద్ ఇబ్రహీం పాత్రను ఇమ్రన్ హష్మి చేయగా.. మందాకిని పాత్రను ఎమీ కింగ్‌స్టన్ చేశారు.

    తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఏక్తాకపూర్ అనుకుంటున్నారు. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలాజీ మోషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటిస్తోంది. తాజాగా ఇదే సంస్థ బాలీవుడ్ నటి మందాకిని జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమాని నిర్మించాలనుకుంటోందట. మాఫియా లీడర్ అయిన దావూద్ ఇబ్రహీంతో వ్యవహారాలు సాగించిన మందాకిని ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈవిడగారి జీవితాన్ని తెరకెక్కించడానికి ప్రయత్రాలు చేస్తున్న బాలాజీ మోషన్స్ సంస్థ ఇలియానాని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఇప్పటికే 'బర్ఫీ" చిత్రం ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఇలియానా మందాకిని పాత్రను చేయడానికి అంగీకరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

    English summary
    After the success of Once Upon A Time In Mumbai, Ekta Kapoor is all ready to make a sequel to it. The second part of this movie will have a new star cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X